పాములను తింటున్న ఎలుగుబంట్లు.. నల్లమలలో ఆసక్తికర విషయం!

నల్లమల అడవుల్లో ఎలుగుబంట్ల ఆహారపు అలవాట్లపై 18 నెలల పాటు నిర్వహించిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. 143 ఎలుగుబంట్ల మల నమూనాలను పరిశీలించగా.. ఐదు నమూనాల్లో షీల్డ్-టెయిల్ పాము అవశేషాలను పరిశోధకులు గుర్తించారు. మొత్తం నమూనాల్లో 3.5 శాతం పాము అవశేషాలు కనిపించాయి.

పాములను తింటున్న ఎలుగుబంట్లు..  నల్లమలలో ఆసక్తికర విషయం!
Sloth Bears

Edited By:

Updated on: Oct 07, 2026 | 3:23 PM

ఎలుగుబంట్లు సాధారణంగా పండ్లు, వివిధ రకాల చీమలు, చెదలు, తేనే తింటాయని అందరికీ తెలుసు… కానీ పాముల్ని తింటాయని తెలుసా? అవును తాజాగా ఓ పరిశోధనలో ఈ విషయం బహిర్గతం అయ్యింది. హైదరాబాద్ కు చెందిన టైగర్ కన్సర్వేషన్ సొసైటీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సంస్థ ప్రతినిధులు నల్లమల 18 నెలలపాటు సుమారు 143 ఎలుగుబంట్ల ఆహారపు అలవాట్లపై పరిశోధన చేశారు. ముఖ్యంగా ఎలుగుబంట్ల మల నమునాలు సేకరించి పరిశీలించారు. మల నమూనాలను 24గంటల పాటు నీటిలో నానబెట్టి సన్నని జల్లెడల ద్వారా వడకట్టి జీర్ణంకాని కీటకాలు, పండ్లు, ఇతర అవశేషాలను వేరు చేశారు. అయితే వీరి పరిశీలనలో ఆసక్తికరమైన విషయాన్ని కనుగొన్నారు. షీల్డ్ టెయిల్ అనే అరుదైన పాము అవశేషాలను ఎలుగుబంట్ల మల నమునాల్లో గుర్తించారు. సేకరించిన మొత్తం నమూనాల్లో 3.5శాతంగా ఉన్నట్లు తెలుసుకున్నారు.

వర్షాకాలంలో సేకరించిన నమూనాల్లోనే పాము అవశేశాలు లభించినట్లు గుర్తించారు. ఎలుగుబంట్లు వర్షాకాలంలో తడిగా ఉండే నేలలను గోళ్లతో చీల్చి… చీమలు, చెదపురుగులను తింటుంటాయి. ఈ క్రమంలో తడి నేలలో పైభాగానికి వచ్చిన షీల్డ్ టెయిల్ పాములు వాటి గోర్లకు చిక్కి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయిదు మల నమూనాల్లోని అవశేషాల్లో షీల్డ్ టెయిల్ పాము పొలుసులు, వెన్నుపూస భాగాలతో పాటు కీటకాలు, పండ్ల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎలుగుబంట్లు పాములను ప్రత్యేక ఆహారంగా తీసుకోకుండా… మిశ్రమంగా ఉన్నట్లు పరిశోధకులు గ్రహించారు.

ఇక పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాన్ని జంతుశాస్త్ర సంబంధిత అంశాలు, ఆవిష్కరణలు ప్రచురించే ఏషియన్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ జూలాజీకి పంపారు. వారు ఈ పరిశోధననను ప్రచురించారు. ఇక ఎలుగుబంట్ల ఆహారపు అలవాట్లపై పరిశోధన ఇంకా కొనసాగిస్తున్నట్లు హైదరాబాద్ టైగర్ కన్సర్వేషన్ సొసైటీ సభ్యులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us