Telangana: లోక్‌సభ బరిలో ‘ఆరుగురు’.. ఈ సూపర్‌ సిక్స్‌ మహిళా నేతల్లో గెలిచేదెవరు? పార్లమెంటులో నిలిచేదెవరో!

తెలంగాణ ఏర్పడ్డాక మూడోసారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో మహిళా నేతలు పోటీ చేస్తుండడం ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు ఆయా పార్టీలు ప్రకటించిన ఆరుగురు మహిళా నేతలకు ప్రత్యర్థులుగా, అయా పార్టీలు పురుష అభ్యర్ధులను బరిలో నిలపడం విశేషం. ఈ ఆరుగురు మహిళా అభ్యర్ధుల్లో ముగ్గురు రాజకీయాల్లో కొత్త ముఖాలు.

Telangana: లోక్‌సభ బరిలో ‘ఆరుగురు’.. ఈ సూపర్‌ సిక్స్‌ మహిళా నేతల్లో గెలిచేదెవరు? పార్లమెంటులో నిలిచేదెవరో!
Six Women Contesting From Telangana
Follow us

|

Updated on: Apr 16, 2024 | 6:25 PM

తెలంగాణ ఏర్పడ్డాక మూడోసారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో మహిళా నేతలు పోటీ చేస్తుండడం ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు ఆయా పార్టీలు ప్రకటించిన ఆరుగురు మహిళా నేతలకు ప్రత్యర్థులుగా, అయా పార్టీలు పురుష అభ్యర్ధులను బరిలో నిలపడం విశేషం. ఈ ఆరుగురు మహిళా అభ్యర్ధుల్లో ముగ్గురు రాజకీయాల్లో కొత్త ముఖాలు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబాబాద్ రిజర్వుడ్ నియోజకవర్గాల నుంచి ముగ్గురు మహిళా నేతలు పోటీ చేస్తుండగా, మిగతా ముగ్గురు జనరల్ స్థానాల్లో బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు, భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఒక మహిళా నేత పార్లమెంటు ఎన్నికల బరిలో ఉన్నారు.

తెలంగాణలో 17 స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులను మినహాయిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల తరపున 51 మంది, హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి ఎంఐఎం అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పోటీకి దిగుతున్నారు. దీంతో ఈ ఎన్నికలకు మూడు ప్రధాన పార్టీల నుంచి 52 మంది మంది అభ్యర్ధులు పోటీ చేస్తూ తమ ఆదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటి వరకు మూడు ప్రధాన పార్టీలు ప్రకటించిన ఆరుగురు మహిళా నేతలకు ప్రత్యర్థులుగా పురుష అభ్యర్ధులను బరిలో నిలిచారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు మహిళామణులు సిద్ధమయ్యారు.

పాలమూరు బరిలో డీకే అరుణ

మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పోటీ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరుణ మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేసి మూడు లక్షల ఓట్లు సాధించినా ఓటమి తప్పలేదు. మళ్ళీ ఈసారి ఎన్నికల్లోనూ ఆమె బరిలోకి దిగారు. డికే అరుణకు ప్రత్యర్థిగా బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ త్రిముఖ పోరులో విజయం సాధిస్తాననే విశ్వాసంతో ఉన్నారు డీకే అరుణ.

ఎంఐఎం కంచుకోటలో మాధవీలత..?

ఇక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే మాధవీ లత, లేటెస్టుగా రాజకీయ సేవ వైపు టర్న్‌ తీసుకున్నారు. బీజేపీ కండువా కప్పుకుని హైదరాబాద్‌ ఎంపీ బరిలో దిగారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో సత్తా చాటేందుకు మాధవీలత రంగంలోకి దిగారు. అదీ కూడా ఎంఐఎం కంచుకోటలో సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్‌తో తలపడుతున్నారు. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎక్కుడా తగ్గడం లేదు. ఇక బీఆర్ఎస్ తరపున మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. ఇక ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరన్నది నిర్ణయం కాలేదు. ఊహించని రీతిలో హైదరాబాద్‌లో చతుర్ముఖ పోటీ జరుగుతుండడంతో విజయం ఎటువైపు ఉండబోతున్నదీ హాట్‌టాపిక్‌గా మారింది.

టీచర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ..

టీచర్‌గా విద్యార్థులకు చదువులు చెప్పిన ఆత్రం సుగుణ… ఇప్పుడు రాజకీయ పాఠాలు చెబుతున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆదిలాబాద్‌ ఎంపీ సీటు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ప్రజా ఉద్యమాలు నిర్వహించిన నేపథ్యంలో జన బలం తనకు తోడుగా ఉందని ఆమె భావిస్తున్నారు. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన సుగుణ లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు బలమైన వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ నగేష్, బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క స్థానికంగా మకాం వేసి సుగుణ విజయానికి అలుపెరగని పోరాటం చేస్తున్నారు.

సిట్టింగ్‌ సీటులో మాలోతు కవిత బిగ్ ఫైట్‌

మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత, బీఆర్ఎస్ నుంచి మరోసారి బరిలో దిగారు. మాజీ ఎమ్మెల్యే, గిరిజన నేత రెడ్యానాయక్ కుమార్తె కవిత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ను ఆమె ఓడించారు. ఈ ఎన్నికల్లో మళ్ళీ బలరాం నాయక్‌తో కవిత తలపడుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా సీతారాం నాయక్ బరిలో నిలిచారు.

ఓరుగల్లులో పొలిటికల్‌ డాక్టర్‌..

వైద్య వృత్తిని వీడి రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజా సేవ చేయాలన్న పట్టుదలతో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా వరంగల్ లోక్‌భ నుంచి కావ్య పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేసిన కావ్య రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. ఇక్కడ బీజేపీ తరపున బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక బీఆర్ఎస్ తరుఫున ఉద్యమనాయకుడు డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. వరంగల్ త్రిముఖ పోరులో కావ్య గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మల్కాజ్‌గిరిపై సునీతా మహేందర్ రెడ్డి

ఇక ఈ మధ్యే బీఆర్‌ఎస్‌ కారు దిగిన పట్నం సునీతా మహేందర్‌ రెడ్డి.. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇది సీఎం రేవంత్‌ సిట్టింగ్‌ సీటు కావడంతో, ఇక్కడ గెలవడం కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నుంచి ఆమె గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. బీర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరిన సునీత తొలుత దేవేళ్ల లోకసభ నియోజకవర్గం నుంచి చేయాలని భావించారు. అనుహ్యంగా మారిన రాజకీయ ఈ సూపర్‌ సిక్స్‌ మహిళా నేతల్లో గెలిచేదెవరు? పార్లమెంటులో నిలిచేదెవరో.. జూన్‌ 4న తేలనుంది.

ఈ సూపర్‌ సిక్స్‌ మహిళా నేతల్లో గెలిచేదెవరు? పార్లమెంటులో నిలిచేదెవరో.. జూన్‌ 4న తేలనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…