సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో 15 కిలోల గంజాయి.. ఎలా తరలిస్తున్నారో తెలుసా?

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ గంజాయి పట్టివేత జరిగింది. ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ తనిఖీలలో 15.426 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు, దీని విలువ రూ. 8 లక్షలు. ప్లాట్‌ఫామ్‌పై అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. నిందితులు పోలీసులను చూసి పరారయ్యారు. ప్రస్తుతం గంజాయిని సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో 15 కిలోల గంజాయి.. ఎలా తరలిస్తున్నారో తెలుసా?
Railway Ganja Bust

Edited By:

Updated on: Sep 29, 2026 | 7:40 PM

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. రైళ్లలో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్‌ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ తనిఖీలు చేపట్టింది. సీఐ గణపతి రెడ్డి, ఎస్సై నరేష్‌ రెడ్డి సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌లపై తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 10వ నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై రెండు బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించాయి. ఎక్సైజ్‌ అధికారులు బ్యాగులను తనిఖీ చేయగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే గంజాయిని స్వాధీనం చేసుకుని తూకం వేశారు.

బ్యాగుల్లో మొత్తం 15.426 కిలోల గంజాయి ఉన్నట్లు సీఐ గణపతి రెడ్డి తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గంజాయిని ఎవరు తరలిస్తున్నారనే దానిపై ఎక్సైజ్‌ అధికారులు ఆరా తీస్తున్నారు.

అయితే ఎక్సైజ్‌ పోలీసులను గమనించిన నిందితులు తమ వెంట తెచ్చుకున్న బ్యాగులను ప్లాట్‌ఫామ్‌పైనే వదిలి పరారైనట్లు అధికారులు గుర్తించారు. బ్యాగుల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

పట్టుబడిన 15.426 కిలోల గంజాయిని తదుపరి చర్యల నిమిత్తం సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించినట్లు సీఐ గణపతి రెడ్డి వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us