Telangana: విద్యార్థులకు టీజీఎస్‌ఆర్టీసీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యకు చెక్‌

వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి మళ్లీ బడి గంటలు మొగనున్నాయి. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన విద్యార్థులు బ్యాగులతో స్కూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ​విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి టీజీఎస్ ఆర్టీసీ సిద్ధం చేసింది. విద్యార్థులు టైంకు స్కూళ్లకు చేరవేసేందుకు అన్ని రూట్లలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ప్రకటించింది.

Telangana: విద్యార్థులకు టీజీఎస్‌ఆర్టీసీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యకు చెక్‌
Tgs Rtc Student Transport

Updated on: Jun 14, 2026 | 1:42 PM

వేసవి సెలవుల అనంతరం సోమవారం జూన్ 15 సోమవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా 2026-27 విద్యాసంవత్సరానికి గాను పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి అన్ని రీజియన్ లఅధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నూతన విద్యాసంవత్సరంలో మొత్తం 227 పనిదినాలు ఉన్నందున, విద్యార్థులు సకాలంలో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా రవాణా సౌకర్యాలను సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు.

​రాష్ట్రంలోని అన్ని రీజియన్ల అధికారులు, డిపో మేనేజర్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఎండీ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల స్కూల్ టైమింగ్స్‌కు అనుగుణంగా బస్సు సర్వీసులను క్రమబద్ధీకరించాలని, గతంలో నడిపిన అన్ని స్కూల్ రూట్లను విధిగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు బస్సుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా, ఉదయం, సాయంత్రం వేళల్లో ఖచ్చితమైన సమయ పాలన పాటించాలని, అవసరమైన చోట అదనపు ట్రిప్పులు నడపాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఎండీ నాగిరెడ్డి ఆదేశించారు.

ప్రైవేట్‌ స్కూళ్లకు అలర్ట్

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా అటు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు సైతం ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్ల ప్రారంభానికి ముందే స్కూట్‌ బస్సు ఫిట్‌నెస్‌ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. స్కూల్‌ బస్సులు, వ్యాన్‌లను అన్నింటిలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. నిబందనలకు విరుద్దంగా స్కూల్‌ బస్సులను నడిపే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us