School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా మూడు రోజుల సెలవులు!

School Holidays: విద్యార్థులకు శుభవార్త. వచ్చే వారంలో విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. ఏకంగా మూడు రోజుల పాటు పాఠశాలల మూసి ఉండనున్నాయి. వరుస సెలవులతో విద్యార్థులకు పండగే.. పంగడ. ఇప్పటికే ఒంటిపూట బడులు, వేసవి సెలవుల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు.. ఇప్పుడు వరుసగా ఏయే రోజుల్లో సెలవులు రానున్నాయో చూద్దాం..

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా మూడు రోజుల సెలవులు!

Edited By: TV9 Telugu

Updated on: Mar 13, 2025 | 10:38 AM

School Holidays: విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే చాలు ఇక ఎంజాయ్‌. ఇప్పుడు హోలి పండగ రానుంది. పండగ సమయంలో ఎంజాయ్‌ చేసేందుకు ఉత్సాహం చూపుతుంటారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే పాఠశాలలకు వరుస సెలవులు రానున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోలో వచ్చే వారం సెలవుల సందడి మొదలు కానుంది. ఇప్పటికే ఒంటిపూట బడులు, వేసవి సెలవుల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు హోలీ పండగ సెలవులు వచ్చాయి. హోలీ పండగ వీకెండ్‌తో కలిసి వరుసగా మూడు రోజులు సెలవులు రాబోతున్నాయి. మార్చి నెలలో విద్యార్థులకు, ఉద్యోగులకు సెలవులు ఉండనున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం హోలీ పండగ సందర్భంగా మార్చి 14 (శుక్రవారం) సెలవు ప్రకటించింది. ఆ రోజు ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలకు హాలిడే. ఆ తర్వాత మార్చి 15 (శనివారం), మార్చి 16 (ఆదివారం) వీకెండ్ సెలవులు కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు లభించనున్నాయి. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, కార్పోరేట్ కంపెనీలు కూడా ఈ మూడు రోజులు సెలవు ఇవ్వనున్నాయి. అయితే 15న శనివారం కావడంతో కొన్ని పాఠశాలలు సెలవు ఇవ్వకపోయినా కొన్ని పాఠశాలలు సెలవు ఇవ్వనున్నాయి. దీంతో వరుసగా సెలవులు రానున్నాయి. ఈ మూడు రోజులు తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి హోలీ పండగను ఘనంగా జరుపుకోవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి