Telangana: తెలంగాణ కొత్త సీఎస్‌గా 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్‌ జాజు నియామకం

తెలంగాణకు కొత్త సీఎస్‌ వచ్చారు. తెలంగాణ సీఎస్‌గా 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజు నియామకం అయ్యారు. మూడు రోజుల కిందే కేంద్ర సర్వీస్‌ నుంచి రీలీవ్‌ అయిన సంజయ్‌ జాజు తాజాగా తెలంగాణ కొత్త సీఎస్‌గా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీకాల జూన్ 30తో ముగియనుండడంతో ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్నారు.

Telangana: తెలంగాణ కొత్త సీఎస్‌గా 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్‌ జాజు నియామకం
New Cs Of Telangana

Updated on: Jun 26, 2026 | 3:04 PM

తెలంగాణకు కొత్త సీఎస్‌ వచ్చారు. తెలంగాణ సీఎస్‌గా 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజు నియామకం అయ్యారు. జూన్‌ 30వ తేదీతో ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న రామకృష్ణరావు పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సంజయ్ జాజు సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్న సంజయ్ జజును ఇటీవలే కేంద్ర సర్వీస్‌ల నుంచి రిలీవ్ అయ్యారు. ఈయన గత 15 సంవత్సరాలకు పైగా కేంద్ర డిప్యుటేషన్‌పై ఉన్నారు.

ఈయన గతంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (MCH)ను జీహెచ్‌ఎంసీగా మార్చక ముందు, దానికి కమిషనర్‌గా పనిచేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా, విశాఖపట్నం కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ కేడర్‌కు చెందిన సంజయ్ జాజునునే సీఎస్‌గా తిరిగి తీసుకురావడంతో రాబోయే ఎన్నికల ముందు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించడాన్ని ప్రతిబింబిస్తుంది.

రేసులో మరో ఇద్దరు అధికారులు

ఈ సీఎస్‌లో రేసులో 1992 బ్యాచ్‌కు చెందిన మరో ఇద్దరు అధికారులు జయేష్ రంజన్, వికాస్ రాజ్ కూడా ఉన్నారు. జయేష్ రంజన్ ప్రస్తుతం తెలంగాణలో మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, క్రీడలు, పర్యాటక శాఖకు అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక వికాస్ రాజ్ రవాణా, రహదారులు, భవనాల (టీఆర్&బి) శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఇటీవలే రిలీవ్ అయిన 1992 బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజునే కొత్త సీఎస్‌గా నియమితులయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us