Sabarimala Special Trains: ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను నడుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ – కొల్లాం మధ్య అందుబాటులో ఉంటాయని గతవారం వెల్లడించింది. ఈ ప్రత్యేక రైలు (డిసెంబర్ 17న) రేపు సికింద్రాబాద్ నుంచి కొల్లం స్టేషన్‌కు (07109) బయల్దేరనుంది. కొల్లాం నుంచి సికింద్రాబాద్ (07110) కు డిసెంబర్ 19న స్పెషల్ రైలు బయల్దేరుతుందని పేర్కొంది. అయితే.. ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిశూర్, ఎర్నాకులం, కొట్టాయం, చెంగన్‌చెరి, చెంగనూరు, మావలికర, కయాంకులం స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయి.
ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే భక్తులకు ప్రత్యేక సూచనలు చేసింది. ప్రత్యేకంగా వెళ్లే రైళ్లలో కర్పూరం, అగరబత్తీలు లాంటి వెలగించవద్దని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రైళ్లలో మండే స్వభావం ఉండే వస్తువులను అస్సలు తీసుకెళ్లవద్దంటూ హెచ్చరించింది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని, అంతేగాకుండా రూ.వేయి జరిమానా విధించడం జరుగుతుందంటూ రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రత్యేకంగా శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు ఈ సూచనలను గుర్తించుకోవాలని సూచించింది. భక్తులు రైళ్లలో హరతి ఇవ్వడం లాంటివి చేయకూడదని, భక్తులు జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. అందరి భద్రతా దృష్ట్యా ఈ నిబంధనల గురించి ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
Vacant Berths Availability for #sabarimala #SpecialTrains as on 15.08.2021 @ 18.00 hrs @drmned @drmgtl pic.twitter.com/gfA35WuBG3
— South Central Railway (@SCRailwayIndia) December 15, 2021
Also Read: