సమ్మెకు సేనాని సపోర్ట్.. బరిలో దిగుతానన్న పవన్ !

| Edited By:

Oct 31, 2019 | 9:02 PM

తెలంగాణ ఆర్టీసీ అంశంపై సీఎం కేసీఆర్‌తో భేటీ అవుతానన్నారు జనసేనా అధినేత పవన్ కళ్యాణ్. గురువారం ఆర్టీసీ జేఏసీ నేతలు పవన్‌ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డితో పాటు ఇతర నేతలు బంజారాహిల్స్‌లోని జనసేన కార్యాలయంలో పవన్‌ను కలిసి సమ్మెకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు మద్దతు ఇవ్వాల్సిందిగా పవన్‌ను కోరారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పవన్‌ కళ్యాణ్‌కు ఆర్టీసీ జేఏసీ నేతలు వివరించారు. ఈ […]

సమ్మెకు సేనాని సపోర్ట్.. బరిలో దిగుతానన్న పవన్ !
Follow us on

తెలంగాణ ఆర్టీసీ అంశంపై సీఎం కేసీఆర్‌తో భేటీ అవుతానన్నారు జనసేనా అధినేత పవన్ కళ్యాణ్. గురువారం ఆర్టీసీ జేఏసీ నేతలు పవన్‌ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డితో పాటు ఇతర నేతలు బంజారాహిల్స్‌లోని జనసేన కార్యాలయంలో పవన్‌ను కలిసి సమ్మెకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు మద్దతు ఇవ్వాల్సిందిగా పవన్‌ను కోరారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పవన్‌ కళ్యాణ్‌కు ఆర్టీసీ జేఏసీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తనకు అపారమైన గౌరవముందున్న పవన్ కళ్యాణ్.. సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తిచేస్తాన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. 16 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోవడం బాధాకరమని.. కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దంటూ వేడుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంటుందని.. ఇది కేవలం 48 వేల మంది సమస్యకాదన్నారు. ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కార్యక్రమాల్లో పాల్గొంటానని పవన్‌ కళ్యాణ్ తెలిపారు.