Warangal: వరంగల్‌లో భారీ చోరీ.. రూ. 24 లక్షల నగదు, భారీగా ఆభరణలు ఎత్తుకెళ్లిన దొంగలు..

వరంగల్‌లోని రామన్నపేటలో భారీ చోరీ జరిగింది. కటకం సువర్ణ టవర్స్ అపార్ట్మెంట్‌లోని 303 ఫ్లాట్‌లో దొంగలు చొరబడ్డారు. అంకూష్ అనే గోల్డ్ షాప్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. రూ. 24 లక్షల నగదు, పెద్ద మొత్తంలో వెండి ఆభరణాలను అపహరించారు. ఇంట్లో వారంతా పొరుగు గ్రామానికి వెళ్ళిన..

Warangal: వరంగల్‌లో భారీ చోరీ.. రూ. 24 లక్షల నగదు, భారీగా ఆభరణలు ఎత్తుకెళ్లిన దొంగలు..
Warangal Robbery

Updated on: Jun 12, 2023 | 9:56 AM

వరంగల్‌లోని రామన్నపేటలో భారీ చోరీ జరిగింది. కటకం సువర్ణ టవర్స్ అపార్ట్మెంట్‌లోని 303 ఫ్లాట్‌లో దొంగలు చొరబడ్డారు. అంకూష్ అనే గోల్డ్ షాప్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. రూ. 24 లక్షల నగదు, పెద్ద మొత్తంలో వెండి ఆభరణాలను అపహరించారు. ఇంట్లో వారంతా పొరుగు గ్రామానికి వెళ్ళిన సమయంలో అపార్ట్మెంట్‌లో దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. ఊరి నుంచి తిరిగి వచ్చి చూడగా.. ఇళ్లంతా చెల్లచెదురుగా ఉండటాన్ని గమనించారు ఇంటి యజమాని. చోరీ జరిగినట్లు గుర్తించిన ఇంటి యజమాని.. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. పరిసరాల్లోని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us