బియ్యం ఒక్కటే.. బ్రాండ్లు 28! రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాయాజాలం బట్టబయలు!

పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి, పాలిష్ చేసి, ప్రముఖ బ్రాండ్ల పేర్లతో మార్కెట్లో విక్రయిస్తున్న భారీ రైస్ రీసైక్లింగ్ వ్యవహారం రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఒకే రకం బియ్యాన్ని ఏకంగా 28 రకాల బ్రాండ్ల పేర్లతో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలోని రైస్ మిల్లులు, అనుబంధ గోదాములపై విజిలెన్స్, సివిల్ సప్లైస్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయి.

బియ్యం ఒక్కటే.. బ్రాండ్లు 28! రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాయాజాలం బట్టబయలు!
Pds Rice Seized

Updated on: Nov 04, 2026 | 6:01 PM

రంగారెడ్డి జిల్లా: పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి, పాలిష్ చేసి, ప్రముఖ బ్రాండ్ల పేర్లతో మార్కెట్లో విక్రయిస్తున్న భారీ రైస్ రీసైక్లింగ్ వ్యవహారం రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఒకే రకం బియ్యాన్ని ఏకంగా 28 రకాల బ్రాండ్ల పేర్లతో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలోని రైస్ మిల్లులు, అనుబంధ గోదాములపై విజిలెన్స్, సివిల్ సప్లైస్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయి.

సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ రాంకుమార్ నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏకకాలంలో మూడు రైస్ మిల్లులు, వాటికి అనుబంధంగా ఉన్న గోదాముల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ సోదాల్లో 200 క్వింటాళ్లకు పైగా పీడీఎస్ రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా రైస్ మిల్లును నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించినట్లు ఎస్పీ రాంకుమార్ తెలిపారు.

ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని సేకరించి, మిల్లుల్లో పాలిష్ చేసి నాణ్యమైన సోనా మసూరి బియ్యంగా చూపిస్తూ వివిధ బ్రాండ్ల సంచుల్లో ప్యాకింగ్ చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. జేఎస్ఆర్, ఎస్ఎస్, ఎస్‌జేఎల్, కౌ బ్రాండ్, కర్నూల్, ఫైవ్ స్టార్, ముబారక్, వీజీఆర్, ఆర్ఆర్ఐ, బెస్ట్ హెచ్‌ఎంటీ, టమాటో గోల్డ్, గజరాజ్, సూర్య తేజ, జోకర్స్, అన్నపూర్ణ తదితర బ్రాండ్ల పేర్లతో బియ్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మిల్లుల్లో వేల సంఖ్యలో వివిధ కంపెనీల బ్రాండెడ్ సంచులు, ప్యాకింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

మంచాల మండలంలోని రాఘవేంద్ర రైస్ మిల్లుతో పాటు ఇబ్రహీంపట్నం మండలం పోచారంలోని వైష్ణవి, గణేష్ ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు సైతం తనిఖీల్లో పాల్గొని వే-బ్రిడ్జిలు, రికార్డులను పరిశీలించారు. వాటిలో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.

బ్రాండెడ్ లేబుల్స్‌తో ప్యాకింగ్ చేసిన బియ్యాన్ని ప్రముఖ స్టోర్లకు సరఫరా చేస్తున్నారా? ఈ అక్రమ వ్యాపారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? రేషన్ బియ్యం ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? అనే అంశాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. తనిఖీల్లో లభించిన రికార్డులు, నిల్వలు, ప్యాకింగ్ సామగ్రిని పరిశీలించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టి వ్యాపార సరుకుగా మారిన ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us