రైతు బంధుకు రూ. 333.29 కోట్లు విడుదల…

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకానికి నిధులు విడుదలయ్యాయి. దీనికి సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. త్వరలోనే..

రైతు బంధుకు రూ. 333.29 కోట్లు విడుదల...

Updated on: Mar 07, 2020 | 8:51 AM

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకానికి నిధులు విడుదలయ్యాయి. రూ. 333.29 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే రూ. 1350.61 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం విడుదలైన నిధులతో కలిపి 2019-20లో రైతుబంధు పథకానికి రూ.1683.90 కోట్లు విడుదలయ్యాయి. రైతుబంధు పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏడాదికి ఖరీఫ్, రబీ సీజన్ లో రూ.5వేల చొప్పున ఒక్కో ఎకరానికి మొత్తం 10 వేల రూపాయలు అందజేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో అప్పుల బాధ తప్పిందంటూ ర రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us