వారాంతాల్లో హైదరాబాదీలకు దక్షిణ మధ్య రైల్వే బ్యాడ్ న్యూస్ అందించింది. శని, ఆది వారాల్లో ఎంఎంటీఎస్ సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మొత్తం 34 సర్వీసులు రద్దయ్యాయి. కాగా, కేవలం 16 సర్వీసులను మాత్రమే నడిపించనున్నట్లు పేర్కొంది. రద్దు చేసిన రైళ్ల వివరాలను నగరంలోని అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లలో ఉంచినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..
లింగంపల్లి – హైదరాబాద్ మధ్య 18 సర్వీసులు, ఫలక్ నుమా – లింగంపల్లి మధ్య 11 సర్వీసులను రద్దు చేశారు. అలాగే సికింద్రాబాద్ – లింగంపల్లి మధ్య 2 సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శుక్రవారం కూడా 6 ఎంఎంటీఎస్ సర్వీసులను పాక్షికంగా రద్దు చేశారు. కాగా, హైదరాబాద్ నుంచి లింగంపల్లి మధ్య నడిచే రైళ్లను హఫీజ్ పేట్ స్టేషన్ వరకే పరిమితం చేసింది.
Also Read: Tomato Prices: మండిపోతున్న టమాట ధర.. లబోదిబోమంటున్న ప్రజలు
NAARM Hydearbad Jobs 2022: డిగ్రీ అర్హతతో హైదరాబాద్ నార్మ్‌లో ఉద్యోగాలు.. రూ.85000ల జీతం..