హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యించారు. ఒక రోజు పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భాగ్యనగరానికి వచ్చారు.
బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకార్, అధికారులు తదితరులు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రపతి ముర్ముకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకార్, అధికారులు తదితరులు ఘన స్వాగతం పలికారు.
మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేటలో నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్అలోక్ అరాధే పాల్గొన్నారు.
నల్సార్ యూనివర్సిటీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దాదాపు 57 బంగారు పతకాలను రాష్ట్రపతి అందించారు. PhD, LLM, MBA, కోర్సులు పూర్తి చేసుకున్న ఉత్తీర్ణులైన 592 మంది పట్టభద్రులకు రాష్ట్రపతి పట్టాలు ప్రధానోత్సవం చేశారు.
నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవం అనంతరం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుని.. భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించారు.