Dubbak Bus Stand War: దుబ్బాకలో బస్టాండ్‌లో ఏం జరుగుతోంది.. మారికాసేపట్లో ఆ నలుగురు మంత్రులు

|

Dec 30, 2022 | 12:47 PM

Dubbak Bus Stand Political War: దుబ్బాకలో హైటెన్షన్ నెలకొంది. కాసేపట్లో నలుగురు మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ దుబ్బాక బస్టాండ్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రఘునందన్ సైతం హాజరుకాబోతున్నారు.

Dubbak Bus Stand War: దుబ్బాకలో బస్టాండ్‌లో ఏం జరుగుతోంది.. మారికాసేపట్లో ఆ నలుగురు మంత్రులు
Dubbak Bus Stand
Follow us on

దుబ్బాకలో ఇవాళ ఏం జరగబోతుంది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ మధ్య పొలిటకల్‌ హీట్‌ కొనసాగుతున్న నేపథ్యంలో నలుగురు మంత్రులు కాసేపట్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలో హైటెన్షన్ నెలకొంది. కాసేపట్లో నలుగురు మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ దుబ్బాక బస్టాండ్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రఘునందన్ సైతం హాజరుకాబోతున్నారు. కొద్ది రోజులుగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్యే రఘునందన్‌ మధ్య సవాళ్లపర్వం నడుస్తోంది. కౌన్సిలర్‌గా గెలిచే సత్తా ఉందా అన్న ప్రభాకర్ రెడ్డి సవాల్‌కు ఈనెల 30న దుబ్బాకలో చూసుకుందామంటూ కౌంటర్ ఇచ్చారు రఘునందన్. పోలీసులు లేకుండా దుబ్బాక రావాలంటూ కామెంట్ చేశారు. పొలిటికల్ హీట్‌ నేపథ్యంలో టెన్షన్ నెలకొంది.

నేతల మధ్య మాటల వేడి కొనసాగుతున్న నేపథ్యంలో నలుగురు మంత్రులు కాసేపట్లో దుబ్బాక వెళ్తున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దుబ్బాక పట్టణంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన బస్టాండ్ ప్రారంభిస్తారు. ఈక్రమంలో హబ్సీపూర్ నుండి దుబ్బాక వరకు బీఆర్ఎస్ భారీ బైక్ ర్యాలీ చేపట్టనుంది. అనంతరం దుబ్బాక బస్టాండ్ దగ్గర పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. దుబ్బాక- ముస్తాబాద్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించనున్న మంత్రులు.. దుబ్బాక నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ అభినందన సభలో పాల్గొంటారు.

లైవ్ కోసం ఇక్కడ చూడండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం