Khammam గులాబీమయమైన ఖమ్మం.. దేశం నివ్వెరపోయేలా బీఆర్ఎస్ భారీ సభ.. ఏర్పాట్లు ముమ్మరం..

దేశ రాజకీయాల్లో బలమైన అడుగు వేసేందుకు బీఆర్ఎస్ వేగంగా అడుగులు వేస్తోంది. దేశం మెచ్చేలా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. భారీ కటౌట్లు, హోర్డింగ్ లతో ఖమ్మం గులాబిమయమైంది. సభతో దేశ రాజకీయాలు మలుపు...

Khammam గులాబీమయమైన ఖమ్మం.. దేశం నివ్వెరపోయేలా బీఆర్ఎస్ భారీ సభ.. ఏర్పాట్లు ముమ్మరం..
Brs Meeting In Khammam

Updated on: Jan 16, 2023 | 6:30 AM

దేశ రాజకీయాల్లో బలమైన అడుగు వేసేందుకు బీఆర్ఎస్ వేగంగా అడుగులు వేస్తోంది. దేశం మెచ్చేలా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. భారీ కటౌట్లు, హోర్డింగ్ లతో ఖమ్మం గులాబిమయమైంది. సభతో దేశ రాజకీయాలు మలుపు తిరుగుతాయని చెప్పారు బీఆర్ఎస్ నేతలు. ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. 100 ఎకరాల్లో దేశం నివ్వెరపోయేలా సభకు ప్లాన్ చేస్తుంది. కొత్త కలెక్టరేట్ బ్యాక్ సైడ్ ఉన్న స్థలంలో బహిరంగ సభ ఏర్పాట్లు రూపుదిద్దుకుంటున్నాయి. నలుగురు ముఖ్య మంత్రులు, జాతీయ నేతలు హాజరవుతున్న సభకు 5లక్షల మంది జన సమీకరణ చేస్తున్నారు. ఖమ్మం సభతో జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుందని చెప్పారు ఎంపీ గాయత్రి రవి, ఎమ్మెల్సీ తాతా మధు. ఖమ్మం సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి 3 లక్షల మంది టార్గెట్ పెట్టుకున్నారు. దీని కోసం బస్సులు, లారీలు, డిసీఎం సహా పలు వాహనాలను సమకూరుస్తున్నారు.

భారీగా తరలి వచ్చే కార్యకర్తలు, ప్రజానికానికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా.. సభా ప్రాంగణం ప్రాంతంలో 400 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.15 వేల మంది వీఐపీ లకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గాల వారిగా కేటాయించిన ప్లేస్ లో పార్కింగ్ చేసేలా క్యూఆర్‌ కోడ్ ను డ్రైవర్లకు ఇస్తున్నారు. సభా వేదిక ఎదురుగా 20 వేల కుర్చీలు, వీఐపీల కోసం అరైంజ్ చేస్తున్నారు. ఇక మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు.

సభా ప్రాంగణం లోపల, బయటా సుమారు అతిపెద్ద 50- ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చిన వారి కోసం పది లక్షల మంచినీటి ప్యాకెట్లు, వెయ్యి మంది వాలంటీర్లు అందుబాటులో ఉంటారని చెప్తున్నారు నేతలు. సభకు హాజరయ్యే నలుగురు ముఖ్యమంత్రులు, జాతీయ నేతల భారీ కటౌట్లు, హోర్డింగులు సభా ప్రాంగణం, ప్రధాన రహదారుల పక్కన ఖమ్మం నగరంలో ఏర్పాటు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల  కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us