హైదరాబాద్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా కలకలం.. అంతా ఆన్‌లైన్‌లోనే.. కట్టలకొద్దీ డబ్బు సీజ్‌..

|

Apr 15, 2023 | 7:01 PM

హర్యానా నుండి ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డిఎస్ చౌహన్. ఆన్ లైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అలాగే నకిలీ ఎజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా కలకలం.. అంతా ఆన్‌లైన్‌లోనే.. కట్టలకొద్దీ డబ్బు సీజ్‌..
Online Cricket Betting
Follow us on

హైదరాబాద్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా కలకలం రేపుతోంది. బెట్టింగ్‌ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ…కోట్లు ఆర్జిస్తోన్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 20 లక్షల రూపాయాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుండి 20 లక్షల నగదు, బ్యాంక్ అకౌంట్లో ఉన్న 1.3 కోట్ల రూపాయలు, 7 మొబైల్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌కి పాల్పడుతోన్న ముగ్గురు నిందితులను మీడియాముందు ప్రవేశపెట్టారు రాచకొండ సీపీ. ఆన్లైన్ ద్వారా బెట్టింగులు కడుతూ…ఈ ముఠా సభ్యులు భారీగా డబ్బు గుంజుతున్నట్టు గుర్తించారు పోలీసులు.

జగదీష్ రెడ్డి, చరణ్, అశోక్ రెడ్డి లను అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్‌ ముఠాలో ప్రధాన బుకీ ఏపీ కి చెందిన పల్సర్ శ్రీనివాస్ రావు, సురేష్, హర్యానా కి చెందిన విపుల్ మొంగా పరారీలో ఉన్నారు. హర్యానా నుండి ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డిఎస్ చౌహన్. ఆన్ లైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అలాగే నకిలీ ఎజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..