Mahabubnagar: ఐదేళ్లు అయినా కలగని మోక్షం.. దేవరకద్ర రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తికాక నరకం చూస్తున్న జనం..!

హైదరాబాద్ నుంచి రాయచూర్, మంత్రాలయం, బెంగుళూరు వెళ్లే వారు దేవరకద్ర ద్వారా వెళతారు. అంతేగాక ప్రతి రోజు వేలాది వాహనాలు ఇక్కడి నుంచి వెళుతూ ఉంటాయి. ప్రతి ఐదు నిమిషాలకోసారి ట్రెయిన్ వెళుతుండడం వల్ల రైల్వే గేటు వేస్తూ ఉంటారు.

Mahabubnagar: ఐదేళ్లు అయినా కలగని మోక్షం.. దేవరకద్ర రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తికాక నరకం చూస్తున్న జనం..!
Devarakadra Railway Over Bridge
Follow us

|

Updated on: Nov 11, 2022 | 3:41 PM

ఐదు నిమిషాలకోసారి ట్రాఫిక్ జామ్.. కతుకుల రోడ్డు, దుమ్మూధూళి..ప్రతి రోజు చిన్నా చితక రోడ్డు ప్రమాదాలు. దిన దిన గండంగా గడుపుతూ నరకం చూస్తున్నారు ఆ గ్రామ ప్రజలు. ఐదేళ్లుగా బ్రిడ్జీ నిర్మాణం పూర్తి కాక పోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించండని ఎంత మోర పెట్టుకున్నా .. పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర లోని దుస్తితి ఇది. బ్రిడ్జీ నిర్మాణం నత్త నడకన సాగుతుండడంతో ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు స్థానికులు, ప్రయాణికులు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర లో రైల్వే గేటు పడడం వల్ల గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి నానా కష్టాలు ఎదురయ్యేవి. ఈ సమస్యను పరిష్కరించేందుకు బ్రిడ్జీ నిర్మించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ ఓ బి(రైల్వే ఓవర్ బ్రిడ్జీ) బ్రిడ్జి నిర్మించేందుకు సిద్ధపడ్డాయి. దీనికి సంబంధించిన పనులు 25 కోట్ల రూపాయలతో 2017లో ప్రారంభమయ్యాయి. రైల్వే ట్రాక్ ఉన్న ప్రాంతంలో రైల్వే శాఖ చకచకా బ్రిడ్జీ నిర్మించింది. మిగతా భాగంలో రాష్ట్ర ప్రభుత్వం బ్రిడ్జితో పాటు సర్వీస్ రోడ్లు నిర్మించాల్సి ఉంది. దీనికి సంబంధించిన పనులు ఆది నుంచి నత్త నడకనా సాగుతూ వచ్చాయి. కరోనా ప్రభావంతో కొంత కాలం పనులు నిలిచిపోయాయి. ఆతర్వాత తొలుత పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో 16 కోట్ల రూపాయల పనులను మరో కాంట్రాక్టర్ కు అప్పగించారు. కాంట్రాక్టర్ మారినప్పటికీ పనులు మాత్రం ఇంకా నత్త నడకన సాగుతున్నాయి. దీంతో ప్రయాణికులు, స్థానికులు ప్రత్యేక్ష నరకం చూస్తున్నారు.

హైదరాబాద్ నుంచి రాయచూర్, మంత్రాలయం, బెంగుళూరు వెళ్లే వారు దేవరకద్ర ద్వారా వెళతారు. అంతేగాక ప్రతి రోజు వేలాది వాహనాలు ఇక్కడి నుంచి వెళుతూ ఉంటాయి. ప్రతి ఐదు నిమిషాలకోసారి ట్రెయిన్ వెళుతుండడం వల్ల రైల్వే గేటు వేస్తూ ఉంటారు. ఓ వైపు బ్రిడ్జీ పనులు సాగుతుండడం వల్ల రోడ్డు మరింత ఇరుకుగా మారింది. రెండు వైపులా వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోతున్నాయి. ఆతర్వాత ట్రాఫిక్ క్లియర్ కావడానికి గంటల సమయం పడుతోంది. ప్రతి రోజు వాహనదారుల మధ్య గొడవలు, చిన్నాచితక ప్రమాదాలు జరుగుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఒక్క పోలీసు కూడా కనిపించరు. అంతేగాక విపరీతమైన దుమ్మూ, ధూళీ ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తోంది. బ్రిడ్జీ నిర్మాణం త్వరగా పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని ఎన్ని సార్లు మోరపెట్టుకున్నా పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడని స్థానికు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైల్వే బ్రిడ్జీ నిర్మాణం చేపట్టి నాలుగేళ్లు పూర్తయ్యాయని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల తాము ఇబ్బందులెదుర్కొంటున్నమని, సర్వీసు రోడ్డు కూడా సరిగా లేదని గత కొని ఏళ్లుగా ఈ ప్రాంతంలో ప్రయాణం అంటే నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ప్రతి రోజు అంబులెన్స్ ల్లో వెళ్లే రోగులు, విద్యార్ధులు, ఉద్యోగులు నరకం చూస్తున్నారని, రైళ్ల సంఖ్య కూడా పెరగడంతో గడికోసారి రైల్వే గేటు వేస్తున్నారని, ట్రాఫిక్ జామ్ వల్ల చాలా సమస్య లెదుర్కొంటున్నామంటున్నారు మరికొంత మంది. ఇప్పటికైనా బ్రిడ్జీ నిర్మాణ పనులు త్వరతగతిన పూర్తి చేసిన..స్థానికుల, ప్రయాణికుల సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉంది. నాసిరకం పనులు జరగకుండా అధికారుల పర్యవేక్షణ కూడా ఎంతైనా అవసరం.

ఇవి కూడా చదవండి

Reporter : Sami, TV9 Telugu

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..