పండుగ వేళల్లో సరిపడిన బస్సులతో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే వీటికి అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి రావడంతో అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే రానున్న దసరా పండుగకు ముందు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణీకులకు తీపి కబురు అందించారు. దసరా పండుగ సందర్భంగా తిప్పే స్పెషల్ బస్సులకు ఎలాంటి ఎక్స్‌ట్రా ఛార్జీలు చెల్లిండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీంతో మామూలు ఛార్జీలకే ఈ అదనపు బస్సుల్లోనూ ప్రయాణించే ఏర్పాట్లు చేశారు. ఈమేరకు ఈ రోజు ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే దసరా కోసం ఈ ఏడాది ప్రత్యేకంగా 4035 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
గత 5 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి 30 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు సజ్జనార్ పేర్నొన్నారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా టీఎష్ ఆర్టీసీ పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రత్యేక బస్సుల్లో రిజర్వేషన్లతో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు అదనపు ఛార్జీలను కూడా తిరిగి వారికి అందించాలని ఆయన ఆదేశించారు.
అధిక చార్జీలు లేకుండా RTC ప్రయాణం@tsrtcmdoffice@Govardhan_MLA pic.twitter.com/k6D7JH1vXt
— TSRTC (@TSRTCHQ) October 10, 2021
Also Read: Rain Warning: ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం.. తెలంగాణ వ్యాప్తంగా వర్ష సూచన