Rajagopal Reddy: ఆసారైనా మంత్రి పదవి వరించేనా..? ఆ నేతకు సోదరుడి పదవి అడ్డంకిగా మారుతుందా..?

పార్లమెంటు ఎన్నికల సమరం ముగియడంతో మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారనే వార్తలు వస్తున్నాయి. కేబినెట్ కూర్పుపై తీవ్ర కసరత్తు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఢిల్లీలో పార్టీ అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరపుతున్నారట.

Rajagopal Reddy: ఆసారైనా మంత్రి పదవి వరించేనా..? ఆ నేతకు సోదరుడి పదవి అడ్డంకిగా మారుతుందా..?
Komatireddy Rajagopal Reddy
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 15, 2024 | 9:12 PM

పార్లమెంటు ఎన్నికల సమరం ముగియడంతో మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారనే వార్తలు వస్తున్నాయి. కేబినెట్ కూర్పుపై తీవ్ర కసరత్తు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఢిల్లీలో పార్టీ అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరపుతున్నారట. ఈ నేపథ్యంలోనే కేబినెట్ బెర్త్ కోసం ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారట. ఈసారి విస్తరణలో పార్టీ ఇచ్చిన బాధ్యతను నెరవేర్చినందుకు కీలక నేతకు మంత్రి పదవి వరించేనా..? సోదరుడి మంత్రి పదవి ఆ నేతకు అడ్డంకిగా మారుతుందా..? పార్టీలో చేరిన సమయంలో ఇచ్చిన మంత్రి పదవి హామీని అధిష్టానం నిలబెట్టుకుందా..? ఆ ఉమ్మడి జిల్లాకు మూడో మంత్రి పదవి దక్కుతుందా..? అన్నదీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్, పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టుకోలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల పోరు ముగియడంతో ఇక, కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత దృష్టి సారించారట. ఇటీవల ఢిల్లీ పర్యటనలో రేవంత్ పార్టీ అధినేతలతో కేబినెట్ కూర్పుపై కసరత్తు చేశారట. ప్రస్తుతం సీఎం సహా కేబినెట్‌లో 12 మంది ఉన్నారు. మరో ఆరుగురికి విస్తరణలో చాన్స్‌ దక్కనుంది. కాగా ప్రస్తుతం మంత్రి వర్గంలో రేవంత్‌ సహా నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒకరికి ఈ సారి అవకాశం దక్కవచ్చని సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తోపాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, కోదండరాం, మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ బ్రాండ్ ఇమేజ్ కు కేరాఫ్ కోమటిరెడ్డి బ్రదర్స్..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బ్రాండ్ ఇమేజ్ కు కేరాఫ్ అడ్రస్ గా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2009లో భువనగిరి ఎంపీగా, ఆ తర్వాత నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 2018లో కాంగ్రెస్ తరపున మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బిజెపిలో చేరిన రాజగోపాల్ రెడ్డి తిరిగి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరి 2023లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీలో చేరే సమయంలో మంత్రి పదవి ఆఫర్ అధిష్టానం ఇచ్చిందట. ఇప్పటికే రేవంత్ మంత్రి వర్గంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు.

అయితే రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీకి భువనగిరి పార్లమెంటు టికెట్ ఆశించినప్పటికి సీఎం రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కింది. ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ ఇంచార్జిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకు రావాలని అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి టాస్క్ ఇచ్చింది. ఎన్నికలకు కొత్తైన చామల కిరణ్ గెలుపు బాధ్యతను రాజగోపాల్ రెడ్డి అన్ని తానై భుజాన వేసుకున్నారు. పార్టీ ఇచ్చిన టాస్క్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి 2.86 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు.

పార్టీ ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేసిన రాజగోపాల్ రెడ్డి

పార్టీ ఇచ్చిన టాస్క్ సక్సెస్ చేసినందుకు, తన కోరికను తీర్చాలని అధిష్టానాన్ని రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారట. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి పదవి కోసం ఢిల్లీలో అగ్ర నేతలను రాజగోపాల్ రెడ్డి కలిసారట. పార్టీలో ఒకేసారి చేరిన జూపల్లి, పొంగులేటిలకు మంత్రి పదవులు దక్కి తనకు రాకపోవడంతో రాజగోపాల్ రెడ్డి అనుచరులు నిరాశతో ఉన్నారట. పార్టీలో చేరిక సమయంలో తనకు మంత్రి పదవిపై అధిష్టానం హామీ ఇచ్చిందని.. ఆయన గుర్తు చేస్తున్నారట. సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి, తనకు ఏమాత్రం అడ్డంకి కాదని భావిస్తున్నారట. తనకు హోం మంత్రి పదవి ఇస్తే అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలను జైల్లో పెడతానని గతంలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు రాజ్‌గోపాల్ రెడ్డి.

మలివిడత మంత్రివర్గ విస్తరణపై బోలెడు ఆశలు..!

మలివిడత మంత్రివర్గ విస్తరణపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బోలెడు ఆశలు పెట్టుకున్నారట. మంత్రి పదవికి కొద్ది దూరంలో మాత్రమే ఉన్నానంటూ కేడర్‌కు ఆయన చెబుతున్నారట. తాను కూడా మంత్రి అవుతానంటూ రాజగోపాల్ రెడ్డి ధీమాతో ఉన్నారట. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చానంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. మునుగోడు ప్రజలకు త్వరలో పార్టీ అధిష్టానం శుభవార్త చెబుతుందని ఆయన చెప్పారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చిన తాను స్వీకరిస్తానని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి సొంత గూటికి వచ్చిన తర్వాతే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా మొత్తాన్ని కాంగ్రెస్‌ స్వీప్ చేసిందని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషి వల్లే భువనగిరిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచాడని ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీ ఇచ్చిన బాధ్యతను నెరవేర్చినందుకు రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్ బెర్తు ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో ఫైనల్ గా అవకాశం దక్కుతుందా లేదా అనేది పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
టీమిండియా ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేసిన ఆస్ట్రేలియా..
టీమిండియా ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేసిన ఆస్ట్రేలియా..
12మంది హీరోలో నో చెప్పిన కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సూర్య..
12మంది హీరోలో నో చెప్పిన కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సూర్య..
ఒక్క ప్రకటనతో సేవింగ్స్ మొత్తం ఖతం.. డబ్బులు నష్టపోకుండా ఈ సలహా..
ఒక్క ప్రకటనతో సేవింగ్స్ మొత్తం ఖతం.. డబ్బులు నష్టపోకుండా ఈ సలహా..
హలో బ్రదరూ..! కేవలం 10 సెకన్లలో ఈ ఫోటోలో పామును గుర్తిస్తే
హలో బ్రదరూ..! కేవలం 10 సెకన్లలో ఈ ఫోటోలో పామును గుర్తిస్తే
స్మార్ట్‌ఫోన్ వేడెక్కుతుందా..? ఈ సింపుల్ టిప్స్‌తో సమస్య ఫసక్
స్మార్ట్‌ఫోన్ వేడెక్కుతుందా..? ఈ సింపుల్ టిప్స్‌తో సమస్య ఫసక్
సింగిల్ చార్జ్‌పై అత్యధిక రేంజ్ ఇచ్చే ఈ-స్కూటర్లు ఇవే..
సింగిల్ చార్జ్‌పై అత్యధిక రేంజ్ ఇచ్చే ఈ-స్కూటర్లు ఇవే..
వాహనంలో పెట్రోల్‌ కొట్టిస్తున్నారా? ఇవి గమనించండి.. లేకుంటే మోసమే
వాహనంలో పెట్రోల్‌ కొట్టిస్తున్నారా? ఇవి గమనించండి.. లేకుంటే మోసమే
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నకు మంత్రి అచ్చెన్న ఆసక్తికర సలహా..
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నకు మంత్రి అచ్చెన్న ఆసక్తికర సలహా..
మీ వాహనం ఫిట్‌గా లేకపోతే మీ లైఫ్ ఫట్..!
మీ వాహనం ఫిట్‌గా లేకపోతే మీ లైఫ్ ఫట్..!
ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. ఏకంగా 2వసారి బాదేశాడుగా..
ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. ఏకంగా 2వసారి బాదేశాడుగా..