Hyderabad: ఒక్క ప్రకటనతో సేవింగ్స్ మొత్తం ఖతం.. డబ్బులు నష్టపోకుండా ఈ సలహా..

మీ సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారా.. అందుకోసం కష్టపడి డబ్బు కూడబెట్టారా.. ఓ మంచి రియల్ ఎస్టేట్ కంపెనీ చూసి వారికి డబ్బు అప్పగిస్తున్నారా.. అక్కడే కాస్త ఆలోచించండి. వారు చేసే ప్రకటనల వెనుక ఎంత మోసం ఉందో కనిపెట్టండి. తరువాతే డబ్బు కట్టండి. లేదంటే మీ డబ్బు పోయి.. మీ ఆశలు అడియాసలు అవ్వడం ఖాయం. తెలంగాణలో రోజుకో రియల్ ఎస్టేట్ కంపెనీ పుట్టుకొస్తోంది.

Hyderabad: ఒక్క ప్రకటనతో సేవింగ్స్ మొత్తం ఖతం.. డబ్బులు నష్టపోకుండా ఈ సలహా..
Gsr Infra
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 22, 2024 | 4:02 PM

మీ సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారా.. అందుకోసం కష్టపడి డబ్బు కూడబెట్టారా.. ఓ మంచి రియల్ ఎస్టేట్ కంపెనీ చూసి వారికి డబ్బు అప్పగిస్తున్నారా.. అక్కడే కాస్త ఆలోచించండి. వారు చేసే ప్రకటనల వెనుక ఎంత మోసం ఉందో కనిపెట్టండి. తరువాతే డబ్బు కట్టండి. లేదంటే మీ డబ్బు పోయి.. మీ ఆశలు అడియాసలు అవ్వడం ఖాయం. తెలంగాణలో రోజుకో రియల్ ఎస్టేట్ కంపెనీ పుట్టుకొస్తోంది. ఫ్రీలాంచ్ పేరుతో పెద్ద పెద్ద ప్రకటనలు చేసి జనాలను ఈజీగా మోసం చేస్తున్నారు. పేద మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కలను క్యాష్ చేసుకొని వారిని నిలువునా దోచేస్తున్నారు. తీరా బాధితులు లబోదిబోమన్నా వారికి న్యాయం జరగడం కలగానే మిగులుతోంది. ప్రతి వ్యక్తికి తనకంటూ ఓ సొంత ఇళ్లు ఉండాలని కలలు కంటాడు. అందుకోసం పస్తులు ఉండి మరీ రూపాయి రూపాయి కూడబెడుతాడు. అలా కాస్త డబ్బు జమ కాగానే స్థలాలు, ఇళ్ల వేట మొదలు పెడతాడు.

ఇదే చాలా మంది అవినీతి వ్యాపారులకు వరంగా మారింది. జనాల కలలకు కాస్త మెరుగు పెట్టి ప్రకటనలతో మభ్యపెడుతున్నారు. ఆ తరువాత అందినంత దోచుకొని పారిపోతున్నారు. సిటీలో ఇటీవల ఫ్రీ లాంచ్ పేరుతో జిఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ హయత్ నగర్, కొంపల్లి, యాదాద్రి, షాద్ నగర్‎లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టింది. ఆకర్షణీయమైన క్యాట్ లాగ్ తయారు చేసిన ఫ్రీ లాంచ్ అంటూ తక్కువ పెట్టుబడితో లగ్జరీ హౌస్ అంటూ ప్రకటనలు చేసింది. దీనికి ఆకర్షితులైన చాలా మంది మధ్య తరగతి వారు తమ కల నేరవేరుతుందనుకొని జిఎస్ఆర్ రియల్ ఎస్టేట్ ఎండి శ్రీనివాస్‎ని కలిశారు. నెలలు, సంవత్సరాలు కష్టపడి దాచుకున్న లక్షల రూపాయలు అతనికి ముట్టజెప్పారు. అనుకున్న ప్రకారం కోట్ల రూపాయల డబ్బు చేతికి చిక్కేసరికి ఇంకేముంది ఆ సంస్థ బిచాణా ఎత్తేసింది. ఆ తరువాత శ్రీనివాస్ కోర్టు నుండి ముందస్తు బేయిల్ తీసుకొని కనిపించకుండా పోయాడు.

బాధితులు హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం ఒక్క జిఎస్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీనే కాదు నగరంలో అనేక రియల్ మాఫియాలు ఇదే తరహాలో జనాలను దోచుకుంటున్నాయి. డబ్బులు కట్టిన తరువాత రిజిస్ట్రేషన్ చేయకుండా జనాలను నానా ఇబ్బందులు పెడుతున్నాయి. శివార్లలో మంచి ఆఫర్ అంటూ పేద, మధ్య తరగతి పడే కష్టాలను ఇట్టే దోచుకుంటున్నాయి. అయితే జనాలను ఇలాంటి మోసాలను ముందే గుర్తించాలని అంటున్నారు పోలీసులు. ఏదైనా ల్యాండ్ కొనుగోలు కోసం వెళితే దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలని ఆ తరువాతే డబ్బు అప్పగించాలంటున్నారు. ఏదిఏమైనా ముందు చూపు లేకుండా పరుగులు తీస్తే ఇదిగో ఈ జిఎస్ఆర్ తరహాలో జనాలను మోసం చేయడానికి అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. ఆచితూచి అడుగుపెట్టక పోతే సర్వం మాయమైపోవడం ఖాయం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రోహిత్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్..
రోహిత్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్..
చిన్న తప్పుతో కోహ్లీ కథ క్లోజ్..
చిన్న తప్పుతో కోహ్లీ కథ క్లోజ్..
వైరల్ ఆప్టికల్ ఇల్యూషన్.. ఇందులో ఉండే ఆన్సర్ కనిపెట్టండి చూద్దాం!
వైరల్ ఆప్టికల్ ఇల్యూషన్.. ఇందులో ఉండే ఆన్సర్ కనిపెట్టండి చూద్దాం!
ప్రపంచ కప్ చరిత్రలో రోహిత్ స్పెషల్ హిస్టరీ..
ప్రపంచ కప్ చరిత్రలో రోహిత్ స్పెషల్ హిస్టరీ..
కల్కి సినిమా ఒక కళాఖండం అంటూ అన్ని వైపుల నుంచి కాంప్లిమెంట్లు
కల్కి సినిమా ఒక కళాఖండం అంటూ అన్ని వైపుల నుంచి కాంప్లిమెంట్లు
పడక గదిలో దిండు కింద వీటిని పెట్టి నిద్రపోయారంటే..
పడక గదిలో దిండు కింద వీటిని పెట్టి నిద్రపోయారంటే..
నడిరోడ్లపై సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల అదుపులో ముఠా
నడిరోడ్లపై సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల అదుపులో ముఠా
టెస్టులు చేసి బిత్తరపోయిన డాక్టర్లు.. అతని గొంతు లోపల
టెస్టులు చేసి బిత్తరపోయిన డాక్టర్లు.. అతని గొంతు లోపల
మీరు గురకతో బాధపడుతున్నారా.? భవిష్యత్తులో ఈ సమస్య తప్పదు
మీరు గురకతో బాధపడుతున్నారా.? భవిష్యత్తులో ఈ సమస్య తప్పదు
పచ్చి వెల్లుల్లి మంచిది కదా అని తిన్నారంటే చిక్కుల్లో పడటం ఖాయం
పచ్చి వెల్లుల్లి మంచిది కదా అని తిన్నారంటే చిక్కుల్లో పడటం ఖాయం
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!