Lifestyle: మీరు గురకతో బాధపడుతున్నారా.? భవిష్యత్తులో ఈ సమస్య తప్పదు

ఆరవై ఏళ్ల తర్వాత తొలిసారి మూర్చ రావడానికి నిద్ర పోతున్నప్పుడు కాసేపు శ్వాస ఆడకపోవటం (స్లీప్‌ అప్నియా), రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గటానికీ సంబంధం ఉంటున్నట్లు తేలింది. భవిష్యత్తులో మూర్ఛ రావడానికి ఇదే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. ఇదేదో ఆషామాషీగా చెబుతోన్న విషయం కాదు. పరిశోధనలు చేసి మరీ ఈ విషయాన్ని...

Lifestyle: మీరు గురకతో బాధపడుతున్నారా.? భవిష్యత్తులో ఈ సమస్య తప్పదు
Snoring
Follow us

|

Updated on: Jun 27, 2024 | 9:34 PM

గురక చాలా మందిలో కనిపించే సర్వసాధారణమైన సమస్య. ఈ సమస్యతో బాధపడుతున్నట్లు కూడా తెలియదు. అయితే పక్కన పడుకున్న వారికి మాత్రం ఇదో పెద్ద సమస్యగానే ఇన్ని రోజులు అనుకున్నాం. అయితే గురక దీర్ఘకాలంగా ఉంటే మాత్రం అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. గురక వల్ల భవిష్యత్తులో మూర్ఛ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఆరవై ఏళ్ల తర్వాత తొలిసారి మూర్చ రావడానికి నిద్ర పోతున్నప్పుడు కాసేపు శ్వాస ఆడకపోవటం (స్లీప్‌ అప్నియా), రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గటానికీ సంబంధం ఉంటున్నట్లు తేలింది. భవిష్యత్తులో మూర్ఛ రావడానికి ఇదే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. ఇదేదో ఆషామాషీగా చెబుతోన్న విషయం కాదు. పరిశోధనలు చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. నిద్రలో కొందరికి కొందరికి గొంతు వెనకాల భాగం వదులై శ్వాస మార్గానికి అడ్డుతగులుతుంది.

దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పాడుతాయి. ఈ కారణంగా రక్తంలో ఆక్సిజన్‌ తగ్గుతుంది, దీంతో శ్వాస తీసుకోవడం అనివార్యం కావడంతో బిగ్గరగా గురక పెడుతూ తిరిగి శ్వాస తీసుకుంటుంటారు. అయితే నిద్రలో ఉండడం కారణంగా ఈ విషయాన్ని మనం పెద్దగా గుర్తించలేము. రాత్రంతా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే గురకవస్తుంది. అయితే ఇది ఎక్కువ రోజులు కొనసాగితే మెదడుపైస ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు.

నిద్రలో కాసే శ్వాస ఆగిపోయే వారికి మూర్ఛ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గిపోవడంపై మూర్ఛ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది. దీర్ఘకాలంలో నిద్రలో ఆక్సిజన్‌ శాతం తగ్గితే.. మెదడులో మార్పులు తలెత్తే అవకాశముందని, ఇది మూర్ఛ ముప్పు పెరిగేలా చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. కాబట్టి ఎక్కువ రోజులు గురకతో ఇబ్బందిపడుతంటే కచ్చితంగా వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమమని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..?
రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..?
టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
ఇంట్లో బల్లుల బెడద..? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా తరిమికొట్టండి..
ఇంట్లో బల్లుల బెడద..? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా తరిమికొట్టండి..
అబ్బ.. చలచల్లని వార్త.. వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
అబ్బ.. చలచల్లని వార్త.. వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
కల్కి సినిమాపై బన్నీ రియాక్షన్.. ప్రభాస్ గురించి ఏమన్నారంటే..
కల్కి సినిమాపై బన్నీ రియాక్షన్.. ప్రభాస్ గురించి ఏమన్నారంటే..
Team India: ఛాంపియన్ జట్టుపై ప్రశంసలు..
Team India: ఛాంపియన్ జట్టుపై ప్రశంసలు..