ఖడ్గమృగాల కొమ్ములకు రేడియోధార్మిక చిప్.. ఎందుకో తెలుసా?
TV9 Telugu
30 June 2024
ఖడ్గమృగాల అక్రమ వేటను అరికట్టేందుకు దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు 'రైసోటోప్' అనే పథకాన్ని ప్రారంభించారు.
విత్‌వాటర్‌రాండ్ యూనివర్సిటీకి చెందిన రేడియేషన్ అండ్ హెల్త్ ఫిజిక్స్ యూనిట్ డైరెక్టర్ జేమ్స్ లార్కిన్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
వేటగాళ్ళు ఖడ్గమృగాలను చంపి వాటి కొమ్ములను నరికివేస్తారు. వీటిని సంప్రదాయ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
దక్షిణాఫ్రికాలో వేటగాళ్లను అరికట్టడానికి కొమ్ములో రెండు చిన్న రేడియోధార్మిక చిప్‌లను అమర్చారు. ఖడ్గమృగాలకు ఇందులో ఎలాంటి బాధ ఉండదు.
రేడియోధార్మిక పదార్థం మోతాదు చాలా తక్కువగా ఉంటుంది. ఇది జంతువుల ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపదంటున్నారు నిపుణులు.
రేడియోధార్మిక చిప్ కారణంగా ఈ కొమ్ములు ఎక్కడా ఉపయోగానికి రావు. ఎందుకంటే ఈ పదార్థం మానవులకు విషపూరితమైంది.
ఈ రేడియోధార్మిక చిప్‌లు ఎంత శక్తివంతంగా ఉంటాయంటే, అంతర్జాతీయ సరిహద్దుల్లో అమర్చిన న్యూక్లియర్ డిటెక్టర్లు వాటిని గుర్తిస్తాయి.
వీటివల్ల ఖడ్గమృగాల వేట తగ్గుతుంది. దీంతో వాటి మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతాయి. ఇది వాటిని కాపాడేందుకు సహాయపడతాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి