29 June 2024

మనం తినే టమాటతో ఇన్ని లాభాలున్నాయా.? 

Narender.Vaitla

గుండె సంబంధిత సమస్యలకు టమాట ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని లైకోపీన్ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

టమాటో ఫైబర్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకం, విరేచనాలు వటి జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. 

క్యాన్సర్‌ మహ్మారికి అడ్డుకట్ట వేయడంలో కూడా టమాట ఉపయోగపడుతుంది. ఇందులోని బీటాకెరోటిన్‌ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కణితిని పెరగకుండా నిరోధించడంలో ఉపయోగపడుతుంది.

అధిక రక్తపోటుతో బాధపడేవారు కూడా టమాటను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

మధుమేహం సమస్య ఉన్న వారు కూడా టమాటను ఎంచక్కా తీసుకోవచ్చు. ఇందులోని మంచి గుణాలు శరీరంలో షుగర్‌ కంటెంట్‌ పెరగకుండా ఉపయోగపడుతుంది.

కంటి సమస్యలకు కూడా టమాటో దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇందులోని లుటిన్, లైకోపీన్ వంటి ముఖ్యమైన కెరోటినాయిడ్లు అలాగే ఆక్సిడెంట్స్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

మానసిక సమస్యలకు చెక్‌ పెట్టడంలో కూడా టమాట ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మతిమరపు, డిప్రెషన్, టెన్షన్ వంటివి దూరం అవుతాయి. టమాటలోని బి, ఇ విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.