మార్కెట్లో సులువుగా, తక్కువ ధరకే దొరికే ధనియాలను, నీటిలో నానబెట్టుకుని తీసుకోవడం వల్ల ఊహించని ఫలితాలు పొందుతారు. ఈ నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందట.
రోగనిరోధక శక్తిని సహజంగా పెంచే ఆహార పదార్థాల్లో ధనియాలు గొప్పవి. కిచెన్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ధనియాలు శరీరంలోని రాడికల్ ఎలిమెంట్లకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి.
ధనియాలలో విటమిన్-కె, విటమిన్-సి, విటమిన్-ఏలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేస్తుంది. వెంట్రుకలు కుదుళ్ల నుంచి మెరుగయి, జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి.
కొవిడ్ వంటి ప్రమాదకరమైన వైరస్‌లు, ఫ్లూతో పోరాడే శక్తి ఈ వాటర్‌కు ఉంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ధనియా వాటర్‌ను తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.
వైద్యశాస్త్రంలో ధనియాలకు మంచి ప్రాధాన్యం ఉంది. ఉదయాన్నే ధనియా వాటర్ తాగడం వల్ల అరుగుదల బాగుంటుంది. జీర్షక్రియ మెరుగ్గా పనిచేయడం వల్ల శరీర బరువు కూడా త్వరగా తగ్గుతుంది.
నానబెట్టిన ధనియా వాటర్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లకు ధనియా వాటర్ చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.
ధనియా వాటర్ కిడ్నీలను బలపరుస్తుంది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తినిస్తుంది. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేందుకు, టాక్సిన్లను బయటకు పంపేందుకు, గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది.
ధనియాలలో ఉండే ఐరన్ ఫంగస్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గించి, మృదువైన చర్మం కావాలంటే క్రమం తప్పకుండా ధనియా వాటర్ తాగాల్సిందే.