నడిరోడ్లపై సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల అదుపులో ముఠా..

విజయనగరం జిల్లా రాజాంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. ఆకతాయిలు గ్రూప్స్‎గా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతున్నారు. రెండు రోజుల క్రితం రాజాంలో జరిగిన ఓ ఘటన భయాందోళనను రేకెత్తిస్తుంది. రాజాం పట్టణం, డోలపేటలో నవీన్ అనే ఓ ఆకతాయి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. మద్యం, గంజాయి మత్తులో జోగుతుంటాడు. ఈ ఆకతాయి మరికొందరు స్థానికులతో కలిసి ఒక గ్యాంగ్‎ను ఏర్పాటుచేశాడు. అప్పటినుంచి అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాడు.

నడిరోడ్లపై సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల అదుపులో ముఠా..
Vijayanagaram
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 27, 2024 | 9:45 PM

విజయనగరం జిల్లా రాజాంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. ఆకతాయిలు గ్రూప్స్‎గా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతున్నారు. రెండు రోజుల క్రితం రాజాంలో జరిగిన ఓ ఘటన భయాందోళనను రేకెత్తిస్తుంది. రాజాం పట్టణం, డోలపేటలో నవీన్ అనే ఓ ఆకతాయి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. మద్యం, గంజాయి మత్తులో జోగుతుంటాడు. ఈ ఆకతాయి మరికొందరు స్థానికులతో కలిసి ఒక గ్యాంగ్‎ను ఏర్పాటుచేశాడు. అప్పటినుంచి అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సుమారు ఆరు నెలల క్రితం రాజాంలో అమ్మవారి పండుగ జరిగింది. నవీన్ గ్యాంగ్ మద్యం మత్తులో ఆ పండుగలోకి చొరబడి హల్చల్ చేసింది. ఆ సమయంలోనే రాజాంలోని గొల్లవీధికి చెందిన మరి కొంతమంది యువకులు కూడా మద్యం మత్తులో ఉన్నారు. దీంతో ఆ రెండు వర్గాల మధ్య వివాదం రేగింది. ఆ వివాదం రెండు గ్రూప్స్ మధ్య గ్యాంగ్ వార్‎గా మారింది. ఎప్పుడు ఎవరు దొరుకుతారా? ఎవరిని కొట్టాలా? అని ఇరువర్గాలు పగ పెంచుకున్నాయి. ఈ క్రమంలోనే జూన్ 25న రాత్రి రాజాం పట్టణంలో గొల్ల వీధి వారికి చెందిన ఒక శుభకార్యం జరిగింది. ఆ శుభకార్యానికి ఆవీధికి చెందిన యువకులతో పాటు శ్రీకాకుళం నుండి గౌతమ్ అనే యువకుడు కూడా వచ్చాడు. అలా గొల్లపేట యువకులు గౌతం అందరూ కలిసి ఒక బార్ సమీపంలో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో ఆ సమీపంలోనే నవీన్ గ్యాంగ్ కూడా మద్యం సేవిస్తున్నారు. దీంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అక్కడ నవీన్ గ్యాంగ్ 13 మంది ఉండగా, గొల్లపేటకు చెందిన యువకులు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు.

దీంతో నవీన్ గ్యాంగ్ తమపై దాడికి దిగుతారని గుర్తించిన గొల్లవీధికి చెందిన యువకులు వెంటనే అక్కడ నుండి పరారయ్యారు. కానీ శ్రీకాకుళం నుండి వచ్చిన గౌతమ్‎కు మాత్రం వారు దాడి చేస్తారనే విషయం తెలియక అక్కడే ఉండి నవీన్ గ్యాంగ్‎కు దొరికిపోయాడు. దీంతో గౌతమ్‎ను బలవంతంగా తమ బైక్‎పై గురువాం సమీపంలోని ఒక తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ అమానుషంగా గౌతమ్ బట్టలు ఊడదీసి, కర్రలతో, బెల్టులతో విపరీతంగా కొట్టి గాయపరిచారు. అలా గౌతమ్‎ను కొట్టి గాయపరిచిన వీడియోలను నవీన్ గ్యాంగ్ చిత్రీకరించి గొల్లవీధి యువకులకు వాట్సాప్ ద్వారా పోస్ట్ చేశారు. దీంతో వెంటనే గొల్లవీధి యువకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నవీన్ మొబైల్ లొకేషన్ ఆధారంగా ఒక తోటలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి గౌతమ్‎ను చితకబాదుతున్నారు. అయితే తోటలోకి వస్తున్న పోలీస్ వాహనాలను చూసిన నవీన్ గ్యాంగ్ అక్కడి నుంచి పరారయ్యారు. అప్పటికే నవీన్ గ్యాంగ్ దెబ్బలకు తీవ్ర గాయాలు పాలై నీరసంగా పడి ఉన్నాడు గౌతమ్. వెంటనే పోలీసులు గౌతమ్‎ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో గౌతమ్‎కు ప్రాణాపాయం తప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు నవీన్ గ్యాంగ్ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు ఘటనలో పాల్గొన్న మొత్తం 13 మందిని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు జువైనల్స్ కూడా ఉండటంతో ముగ్గురిని జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. మిగతా పదిమందిని రిమాండ్‎కు తరలించారు. వారిపై కిడ్నాప్, హాత్యాయత్నంతో పాటు అనేక సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles