అంబేద్కర్‌ విగ్రహాల వద్ద ఎమ్మార్పీఎస్‌ మహాధర్నా

ఇటీవలే భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఐతే సీఎం కేసీఆర్‌ ఈ ఉత్సావాల్లో ఎందుకు పాల్గొనలేదని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. దళితుడైనందునే అంబేద్కర్‌ను సీఎం అవమానించారన్నారు. ఇందుకు నిరసనగా మంగళవారం అన్ని జిల్లాల్లో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఆయన సోమవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ అనారోగ్య సమస్యలతోనూ బాధపడటం లేదని, జయంతి రోజునే ప్రగతి భవన్‌లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. అగ్రకులస్థుడైన ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి […]

అంబేద్కర్‌ విగ్రహాల వద్ద ఎమ్మార్పీఎస్‌ మహాధర్నా
Follow us

| Edited By:

Updated on: Apr 16, 2019 | 6:33 AM

ఇటీవలే భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఐతే సీఎం కేసీఆర్‌ ఈ ఉత్సావాల్లో ఎందుకు పాల్గొనలేదని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. దళితుడైనందునే అంబేద్కర్‌ను సీఎం అవమానించారన్నారు. ఇందుకు నిరసనగా మంగళవారం అన్ని జిల్లాల్లో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఆయన సోమవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ అనారోగ్య సమస్యలతోనూ బాధపడటం లేదని, జయంతి రోజునే ప్రగతి భవన్‌లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. అగ్రకులస్థుడైన ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి హోదాలో హైదరాబాద్‌ వస్తే పాదాభివందనం చేసిన కేసీఆర్‌, దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌తో మాత్రం కరచాలనం చేశారని గుర్తు చేశారు. ఈ నెల 22వ తేదీ వరకు గ్రామపంచాయతీలు, అంబేద్కర్‌ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని మందకృష్ణ స్పష్టం చేశారు.