Tv9 Effect: “కాడెద్దుగా మారిన కొడుకు” కథనానికి స్పందన.. ఆదివాసీ రైతుకు ఎద్దును ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఎంపీ..

"కాడెద్దుగా మారిన కొడుకు" కథనానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపు రావు స్పందించారు. ఆదివాసీ రైతుకు ఎద్దును బహుమతిగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. 

Tv9 Effect: కాడెద్దుగా మారిన కొడుకు కథనానికి స్పందన.. ఆదివాసీ రైతుకు ఎద్దును ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఎంపీ..
Mp Soyam Babu On

Updated on: Jun 16, 2021 | 12:20 PM

“కాడెద్దుగా మారిన కొడుకు” TV9 కథనానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపు రావు స్పందించారు. ఆదివాసీ రైతుకు ఎద్దును బహుమతిగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే ఆ ఎద్దును ఆ రైతు ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి మండలం డొంగర్ గావ్ రైతు అభిమాన్ కు ఎద్దును కానుకగా ఇస్తానంటూ ప్రకటించిన ఎంపి సోయంబాపు రావు. టీవి9 లో ప్రసారమైన కథనానికి స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

టీవీ9లో ప్రసారం అయిన కథనం…

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగర్‌గావ్‌కు చెందిన ఆదివాసీ రైతు అభిమాన్‌కు ఆరెకరాల పొలం ఉంది. వానాకాలం పనులు వేగం కావడం వల్ల తనకున్న ఎద్దులతో పొలాన్ని చదును చేసే క్రమంలో.. అనారోగ్యంతో ఆదివారం రోజు ఆ ఎద్దు చనిపోయింది.
“వ్యవసాయం చేసి ఆ రైతు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. యంత్రాలతో సాగు చేసేంత డ‌బ్బు లేదు. ఇంత‌లో ఖరీఫ్​ రానే వచ్చింది. ఉన్న ఎద్దులతోనే పొలాన్ని రెడీ చేసేందుకు పూనుకున్నాడు. ఇంతలోనే ఆట‌కం. ఓ ఎద్దు అనారోగ్యంతో అక‌స్మాత్తుగా చ‌నిపోయింది. ఇంత‌లో వ‌రుణుడు ప‌లుక‌రించాడు. డబ్బులు లేకపోవటం.. ఈ ఒడుదొడుకులన్నింటినీ దాటేందుకు.. తన కొడుకునే కాడెద్దును చేశాడు ఆ రైతు. కన్నకొడుకే కాడెద్దులా మారి పొలం చదను చేసిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంద్రవెల్లి మండలం డొంగర్‌గావ్‌కు చెందిన ఆదివాసీ రైతు అభిమాన్‌కు 6 ఎక‌రాల‌ పొలం ఉంది. ఖరీఫ్ సీజ‌న్ ప్రారంభం కావ‌డంతో వల్ల తనకున్న ఎద్దులతో పొలాన్ని చదను చేసే క్రమంలో.. అనారోగ్యంతో ఆదివారం రోజున ఓ ఎద్దు చనిపోయింది. ఇప్ప‌టికిప్పుడు మ‌రో ఎద్దును కొనాలంటే కనీసం రూ. 40వేలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. అంత డ‌బ్బు అభిమాన్ వ‌ద్ద లేదు. పైగా సొమవారం వరుణుడు పలకరించడం వల్ల సమయం దాటిపోకుండా ఉండాలంటే పొలాన్ని చదును చేయకతప్పని పరిస్థితి. ఉన్న ఒక్క ఎద్దుతోపాటు మరోవైపు తన కన్నకొడుకు సాయినాథ్‌నే కాడెద్దుగా మార్చి పొలం చదనుచేశాడు.

ఇవి కూడా చదవండి : Smoke in Intercity Train: ఇంటర్‌ సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు..

రెండేళ్ల బుజ్జోడికి భద్రత.. 24×7 కంటికి రెప్పలా కాపాడుతున్న గుజరాత్‌ పోలీసులు

Violating Covid Rules: కరోనా సమయంలో నిర్మల్ జిల్లా అధికారుల విందు.. నిబంధనల ఉల్లంఘనపై స్థానికుల ఆగ్రహం

Petrol Diesel Price: వాహనదారులకు చుక్కలు.. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధర..

Loading...
Unable to load recommendations.
Follow Us