YOUWECAN..: ఎందరినో ఇటువైపు నడిపించిన యు.. వీ.. కెన్.. పెద్దాస్పత్రికి కార్పొరేట్ హంగులు..

యు.. వీ.. కెన్.. క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫౌండేషన్ సహాయంతో నిజామాబాద్‌ జిల్లా పెద్దాస్పత్రి దశ దిశ మొత్తం మారిపోయింది. పేదోడి పెద్దాస్పత్రి ఇప్పుడు కార్పొరేట్ హంగులు అద్దుకుంది. నిరుపేదకు...

YOUWECAN..: ఎందరినో ఇటువైపు నడిపించిన యు.. వీ.. కెన్.. పెద్దాస్పత్రికి కార్పొరేట్ హంగులు..
Yuvraj Singh Nizamabad Govt
Follow us

|

Updated on: Jul 27, 2021 | 1:46 PM

యు.. వీ.. కెన్.. క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫౌండేషన్ సహాయంతో నిజామాబాద్‌ జిల్లా పెద్దాస్పత్రి దశ దిశ మొత్తం మారిపోయింది. పేదోడి పెద్దాస్పత్రి ఇప్పుడు కార్పొరేట్ హంగులు అద్దుకుంది. నిరుపేదకు ఆధునిక వైద్యం అందించేందుకు రెడీ అయింది. కోట్ల రూపాయల విలువ చేసే అత్యాధునిక ఎక్విప్‌మెంట్‌ హాస్పిటల్‌కు చేరాయి. బుధవారం ICU బెడ్స్‌ ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

మిషన్ తౌజండ్ బెడ్స్ పేరుతో సర్కారు దవాఖానాల్లో కార్పొరేట్ స్టయిల్‌లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకొచ్చారు యువరాజ్‌ సింగ్‌. ఇందులోభాగంగా నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రిని సెలెక్ట్ చేసుకున్నారు. రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే 120 ఐసీయూ బెడ్స్‌ అందించారు. ఇంత పెద్ద మొత్తంలో క్రిటికల్ బెడ్స్‌ ఏర్పాటు చేయడం దేశంలోనే ఇది మొదటిసారి.

యువరాజ్ సింగ్ పెద్ద మనసు చాటుకోవడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్‌లో దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసేలా బ్యాట్ ఝుళిపించిన యువీ.. పేదోడి వైద్యం అందించాలన్న ఆలోచన చాలా గొప్పదంటున్నారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల విషయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకున్నారు. యూవీకెన్ ఫౌండేషన్‌ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు.

ఏకంగా 120 ఐసీయూ బెడ్స్ సమకూరడంపై డాక్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థర్డ్‌ వేవ్‌తో పాటు ఎలాంటి వైద్య విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌.

అధునాతన సౌకర్యాల విషయంలో యూవీకెన్ ఫౌండేషన్ సభ్యులు ఎక్కడా తగ్గలేదు. పై పాప్, సిపాప్‌ లాంటి వెంటిలేటర్లతో పాటు ఈసీజీ, డ్రగ్ స్టోరేజీ రిఫ్రిజిరేటర్‌లాంటి సదుపాయను ఐసీయూలో అందుబాటులో ఉంచారు.  కొవిడ్ సమయంలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది చేసిన సేవలకు దేశస్థాయిలో గుర్తింపు వచ్చింది.

ఈ సేవలే యువరాజ్‌ సింగ్‌ దృష్టిని ఆకర్షించేలా చేశాయి. యూవీకెన్ పౌండేషన్ ప్రతినిధుల చొరవతో బుధవారం నుంచి 120 ఐసీయూ బెడ్స్‌ వైద్యానికి ఆందుబాటులోకి రానున్నాయి.

ఇది కూడా చదవండి: Tirumala Electric Buses: తిరుమల టూ తిరుపతి

ఇది కూడా చదవండి: ఎలక్ట్రికల్ బస్సులు.. కొండలపై ఎకో ఫ్రెండ్లీ ప్రయాణం

ఇది కూడా చదవండి: Petrol Diesel Price: పట్టణవాసులకు గుడ్ న్యూస్.. స్థిరంగా పెట్రో ధరలు..ఏపీలో మాత్రం..

ఇది కూడా చదవండి: Rivers overflowing: తెలుగు రాష్ట్రాల్లో నదీ జలాల ఉరుకులు.. పరుగులు.. నిండుకుండలా ప్రాజెక్టులు

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు