క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి.. మొబైల్‌ క్యాన్సర్‌ బస్సును ప్రారంభింన నిజామబాద్‌ కలెక్టర్‌

|

Jan 31, 2021 | 5:06 AM

క్యాన్సర్ వ్యాధి పై అవగాహన పెంచుకోవాలని క్యాన్సర్ వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదన్నారు నిజామాబాద్ జిల్లా..

క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి.. మొబైల్‌ క్యాన్సర్‌ బస్సును ప్రారంభింన నిజామబాద్‌ కలెక్టర్‌
Follow us on

నిజామాబాద్‌: క్యాన్సర్ వ్యాధి పై అవగాహన పెంచుకోవాలని క్యాన్సర్ వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదన్నారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఇందూర్ కాన్సర్ హాస్పిటల్ లో గ్రేస్ క్యాన్సర్ ఆధ్వర్యంలో మొబైల్ బస్సును ప్రారంభించారు.

జిల్లాలోని ప్రతి గ్రామంలో 21 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా క్యాన్సర్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సీఈవో డాక్టర్ చిన్నబాబు.

క్యాన్సర్ టెస్ట్ చేసుకొని క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే మొదటి దశలోనే క్యాన్సర్ ను అరికట్టే అవకాశం ఉందని ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. క్యాన్సర్ ఉన్న వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తామన్నారు.