Watch: బైక్స్ బయటపెట్టి హాయిగా పడుకుంటున్నారా?.. ఇది చూశాక.. మళ్లీ పెట్టరు!

రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల బైక్ చోరీలకు పాల్పడుతున్న పలు అంతర్రాష్ట్ర ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయిన కూడా బైక్ దొంగతనాలు ఆగడం లేదు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో, రాత్రి పూట ఇళ్ల బయట పార్క్ చేసిన బైక్‌లను, డూప్లికేట్ కీలు ఉపయోగించి లేదా హ్యాండిల్ లాక్ విరగ్గొట్టి దొంగిలిస్తున్నారు దుండగులు. ఇక్కడ దొంగిలించిన వాహనాలను ఇతర రాష్ట్రాలకు తరలించి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో వెలుగు చూసింది.

Watch: బైక్స్ బయటపెట్టి  హాయిగా పడుకుంటున్నారా?.. ఇది చూశాక.. మళ్లీ పెట్టరు!
Bike Theft Telangana

Edited By:

Updated on: Jan 28, 2026 | 6:05 PM

మెదక్ జిల్లా చేగుంట (మం) వడియారం గ్రామంలో బుధవారం తెల్లవారున షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పొద్దున్నే అందరూ నిద్రపోతున్న సమయంలో కాలనీలోకి ప్రవేశించిన కొందరు దుండగులు ఇంటి ముందు బైక్‌ను గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో యజమనాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో నివాసం ఉంటున్న నరేందర్ నాయక్‌కు చెందిన గ్లామర్ బైక్‌ను గుర్తు తెలియని దొంగలు చోరీ చేసి తీసుకెళ్లారు. ఉదయం లేచి చూసే సరికి ఇంటి ముందు బైక్ కనిపించకపోవడంతో కంగారు పడిన నరేందర్.. ఇంటి అవరణలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు కనిపించాయి. దీంతో బైక్ యజమాని నరేందర్ వెంటనే స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

గత 15 రోజులుగా వడియారం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో గ్రామస్తుల్లో భద్రత పై ఆందోళన వ్యక్తమవుతోంది. దొంగతనాల నియంత్రణకు పోలీసు గస్తీ పెంచి నిందితులను త్వరగా పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.మరో వైపు ఆన్‌లైన్ బెట్టింగ్‌లు,గంజాయి, ఇతర జల్సాల కోసం యువత ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.