పాప్ కార్న్‌తో పవర్ ఫుల్‌ బెనిఫిట్స్‌ ..

28 January 2026

Jyothi Gadda

పాప్ కార్న్ తినడం ద్వారా కేవలం టైమ్ పాస్ మాత్రమే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా కొన్ని ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 

బరువు తగ్గడానికి ఇది గొప్ప చిరుతిండి. ఇందులో ఎక్కువ మొత్తంలో పీచుపదార్థాలు ఉంటాయి. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది.

పైగా పాప్ కార్న్ లో అదనపు చక్కెర కూడా ఉండదు. దీనిలో ఉండే ఫెరులిక్ యాసిడ్ అనే పాలీఫెనాల్ ఊబకాయంతో పోరాడటానికి సహాయపడుతుంది.

మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారికి పాప్‌కార్న్ చాలా మంచిది. ఎందుకంటే పాప్‌కార్న్‌లోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

 సహాయపడుతుంది. పైగా హెచ్చుతగ్గులకు గురికాకుండా నిరోధిస్తుంది. కాబట్టి, దిగాబెస్ట్స్ ఉన్నవారు దీన్ని ఖచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలి.

పాప్‌కార్న్‌లోని ఉండే ఫైబర్‌ కొవ్వుని తగ్గిస్తుంది.  దీని వలన శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. తద్వారా గుండెపోటు, స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

తరచుగా కడుపు సమస్యలతో బాధపడుతుంటే, ఆహారంలో పాప్‌కార్న్‌ను చేర్చుకోవచ్చు. పాప్‌కార్న్‌లోని ఫైబర్ ప్రేగులలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

 ఇంకా, ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించడమే కాకుండా గట్ మైక్రోబయోమ్, గట్‌లో నివసించే మంచి బ్యాక్టీరియాకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

క్యాన్సర్ రోగులకు పాప్‌కార్న్ ప్రయోజనకరం. పాప్‌కార్న్‌లో పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.