రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైంది.. వామ్మో

మహబూబాబాద్ జిల్లాలో భారీ కొండచిలువ కలకలం రేపింది. తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో తెల్లవారుజామున సుమారు 12 అడుగుల పొడవైన కొండచిలువ నడిరోడ్డుపై ప్రత్యక్షమైంది. రోడ్డు దాటుతూ కొద్దిసేపు అక్కడే హల్చల్ చేయడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, బాటసారులు భయాందోళనకు గురయ్యారు. కొండచిలువ రోడ్డుపై సంచరిస్తున్న దృశ్యాలు వీడియోలో రికార్డు కాగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైంది.. వామ్మో
Mahabubabad Python

Edited By:

Updated on: Aug 20, 2026 | 10:12 AM

ఈ మధ్య భారీ కొండచిలువలు, కింగ్ కోబ్రా పాములు హల్చల్ చేస్తున్నాయి.. ముఖ్యంగా భారీ కొండ చిలువలు జనం మధ్య సంచారం మనుషుల ప్రాణాలకు ముప్పిస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ మహిళ పొలం పనులు చేస్తుండగా కొండచిలువ దాడి చేసింది.. ఈ క్రమంలో అంతా అప్రమత్తమై.. ఆమెను కాపాడారు.. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే.. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ భారీ కొండచిలువ ప్రధాన రహదారిపై హల్చల్ చేసింది.. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు కొండచిలువను చూసి భయంతో హడలెత్తిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది.. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో నడిరోడ్డుపై బారీ కొండచిలువ ప్రత్యక్షమైంది.. సుమారు 12 ఫీట్ల పొడవు ఉన్న కొండచిలువ రోడ్డు దాటుతూ కాసేపు రోడ్డుపై హల్చల్ చేసింది..

వీడియో చూడండి..

తెల్లవారుజామున భారీ కొండచిలువ కలకలం రేపింది. ఆ మార్గంలో వెళ్తున్న బాటసారిలు కొండచిలువను చూసి ఒక్కసారిగా హడలెత్తిపోయారు.. ఆలయం పక్కనుండి రోడ్డు దాటుతున్న దృశ్యాలు గమనించారు.. పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us