Telangana: క్షణికావేశం.. భర్త పండుగకు ఊరికి రానన్నాడని… భార్య సూసైడ్

పండుగ పూట రెండు కుటుంబాల్లో ఊహించని విషాదం నెలకుంది. పండగకు భర్త ఇంటికి రాననడంతో హర్టయిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

Telangana: క్షణికావేశం.. భర్త పండుగకు ఊరికి రానన్నాడని... భార్య సూసైడ్
Married Women Suicide

Updated on: Oct 15, 2021 | 12:10 PM

క్షణికావేశంలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో పండుగ పూట రెండు కుటుంబాల్లో ఊహించని విషాదం నెలకుంది. పండగకు భర్త ఇంటికి రాననడంతో హర్టయిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లాలోని ఆమనగల్లు మేడిగడ్డలో ఈ విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  మేడిగడ్డకి చెందిన వడ్త్యావత్‌ మౌనిక (20)కు అదే గ్రామానికి చెందిన మేనమామ కుమారుడు అనిల్‌తో ఆరు నెలల కిందట పెళ్లి జరిగింది. అనిల్‌ డీసీఎం డ్రైవర్‌‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వృత్తి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాడు. తాజాగా కిరాయి రావడంతో వేరే ఊరు వెళ్లాడు. అయితే దసరా పండగకు ఊరికి రావాలని భార్య మౌనిక భర్తకు ఫోన్‌ చేసింది. పని ఉందని వెంటనే రావడానికి వీలు కాదని చెప్పడంతో హర్టయ్యింది. క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకుంది.

పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు వెంటనే కల్వకుర్తి గవర్నమెంట్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పండుగ పూట జరిగిన విషాదంతో ఇరు కుటుంబాలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: దసరా పండుగ వేళ మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్

దసరా పండుగ వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

Loading...
Unable to load recommendations.
Follow Us