Malla Reddy Dance Video: అట్లుంటది మల్లారెడ్డితోని.. డ్యాన్స్ ఇరగదీసిన మాజీ మంత్రి..

మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో ఎదో విధంగా తెగ హల్చల్ చేస్తుంటాడు. తాజాగా మల్లారెడ్డి మనవరాలి పెళ్లి సంగీత్ కార్యక్రమంలో డ్యాన్స్‌ని ఇరగదీశాడు. డీజే టిల్లు పాటకు హుషారుగా స్టెప్పులు వేశాడు. మంచి కాస్ట్యూమ్‌తో, మనవళ్లను పక్కన పెట్టుకొని... కొరియోగ్రాఫర్లతో కలిసి చిందులు వేశారు.

Malla Reddy Dance Video: అట్లుంటది మల్లారెడ్డితోని..  డ్యాన్స్ ఇరగదీసిన మాజీ మంత్రి..
Mallareddy Dance Video

Edited By: TV9 Telugu

Updated on: Oct 21, 2024 | 6:26 PM

మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తలోకి నిలిచాడు. ఈ సారి డాన్స్‌తో అదరగొట్టారు. 75 ఏళ్ల వయసులో ఆయన స్టేజ్‌పై బ్రేక్ డాన్స్ వేసి ఆహా అనిపించారు. మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈనెల 27న జరగనుంది. అందులో భాగంగానే వివాహానికి ముందు జరిగే కార్యక్రమాలు అవుతున్నాయి. ఆదివారం రాత్రి సంగీత్ కార్యక్రమం జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి జరిగిన సంగీత్ కార్యక్రమంలో మల్లారెడ్డి స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు. మంచి కాస్ట్యూమ్‌తో, మనవళ్లను పక్కన పెట్టుకొని… కొరియోగ్రాఫర్లతో కలిసి స్టెప్పులు వేశారు. ఇందుకోసం మాజీ మంత్రి మల్లారెడ్డి గత వారం రోజులుగా కొరియోగ్రాఫర్ల దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. గతంలోనూ మల్లారెడ్డి అనేకసార్లు డాన్స్ చేసిన.. ఇది మాత్రం సినిమా స్టైల్‌లో వెరైటీగా కనిపిస్తుంది. సంగీత్ ఫంక్షన్లు కచ్చితంగా ఆయన డాన్స్ చేయాల్సిందే బంధువులంతా పట్టుపట్టారు. ప్రస్తుతం మల్లారెడ్డి డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో నెటింట్లో చక్కర్లు కొడుతుంది.

మల్లారెడ్డి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇదిగో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి