Modi Telangana Tour: ఇంతకు ముందు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క.. మోదీ తెలంగాణ టూర్‌పై ఫుల్‌ బజ్‌

ఇంతకు ముందు ఓ లెక్క, ఇప్పుడో లెక్క.. అన్నట్లుగా తయారైంది ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన. ఎన్నికల ప్రచారం కోసమే రాష్ట్రానికి వస్తున్నప్పటికీ, ఈసారి మోదీ టూర్‌ని చూసే కోణం మారింది. ఫేక్‌ వీడియో నేపథ్యంలో మోదీ పర్యటనకు ఫుల్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది

Modi Telangana Tour: ఇంతకు ముందు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క.. మోదీ తెలంగాణ టూర్‌పై ఫుల్‌ బజ్‌
Modi Telangana Visit
Follow us

|

Updated on: Apr 30, 2024 | 8:21 AM

ఇంతకు ముందు ఓ లెక్క, ఇప్పుడో లెక్క.. అన్నట్లుగా తయారైంది ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన. ఎన్నికల ప్రచారం కోసమే రాష్ట్రానికి వస్తున్నప్పటికీ, ఈసారి మోదీ టూర్‌ని చూసే కోణం మారింది. ఫేక్‌ వీడియో నేపథ్యంలో మోదీ పర్యటనకు ఫుల్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఫేక్‌ వీడియో ఇష్యూలో తెలంగాణ సీఎం రేవంత్‌కి సైతం నోటీసులందడంతో, బడే భాయ్‌ స్పీచ్‌ కోసం ఇగర్లీ వెయిట్‌ చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు…!

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి తెలంగాణ గడ్డపై అడుగుపెడుతున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. అత్యధిక ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా ఇవాళ మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. అయితే మోదీ తెలంగాణ టూర్‌పై ఎన్నడూ లేని ఉత్కంఠ ఈసారి నెలకొంది. అందుకు ప్రధానమైన కారణాలూ ఉన్నాయి. రిజర్వేషన్లపై అమిత్‌షా మాట్లాడిన మాటలను వక్రీకరించిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్‌ విభాగం వైరల్‌ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణకు రావాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డికి నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలోనే మోదీ టూర్‌ ఈసారి చాలా ఇంట్రస్ట్‌గా మారింది. మోదీ ఏం మాట్లాడుతారు…? తెలంగాణ కాంగ్రెస్‌పై ఎలాంటి విమర్శలు గుప్పిస్తారు..? మరీ ముఖ్యంగా తనని బడే భాయ్‌ అని పిలిచిన రేవంత్‌రెడ్డిపై మోదీ ఎలా రియాక్ట్‌ అవుతారన్న విషయాలు ఆసక్తి రేపుతున్నాయి.

అమిత్‌ షా ఫేక్‌ వీడియో వ్యవహారంపై ఇప్పటికే స్పందించారు ప్రధాని మోదీ. ఫేక్‌ వీడియో సృష్టించిన వాళ్లకు తగిన గుణపాఠం చెబుతామంటూ గట్టిగా హెచ్చరించారు. ఓడిన వాళ్లే ఇలాంటి ఫేక్‌ వీడియోలు తయారు చేస్తారంటూ విపక్షంపై విరుచుకుపడ్డారాయన. మరోవైపు అమిత్‌ షా సైతం ఈ వీడియోపై గట్టిగానే రియాక్ట్‌ అయ్యారు. ఫేక్‌ వీడియోలతో కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోందంటూ ఫైర్‌ అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగలడం ఖాయమన్నారు. ఇండియా కూటమి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని మండిపడ్డారు అమిత్‌షా.

ఇక ఈ ఫేక్‌ వీడియో ఇష్యూను అస్త్రంగా మల్చుకుని కాంగ్రెస్‌ పార్టీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పర్యటలో మోదీ సైతం ఈ ఇష్యూపై గట్టిగానే రియాక్ట్ కానున్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూనే… సీఎం రేవంత్‌ను టార్గెట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా… అప్పట్లో తెలంగాణకి వచ్చిన మోదీకి గ్రాండ్‌ వెల్‌కమ్ చెబుతూ.. బడే భాయ్‌ అంటూ సంబోధించిన రేవంత్‌ రెడ్డిపై మోదీ ఎలా రియాక్ట్‌ అవుతారన్నదే ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles