Monkeypox: హమ్మయ్య.. కామారెడ్డి యువకుడికి మంకీపాక్స్ నెగెటివ్‌.. నిర్ధారించిన పుణె వైరాలజీ ల్యాబ్‌

Telangana: తెలంగాణ ప్రజలు, వైద్యాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మంకీపాక్స్‌ లక్షణాలున్న కామారెడ్డి యువకుడికి నెగెటివ్‌ అని తేలింది. ఈ మేరకు పుణెలోని వైరాలజీ ల్యాబ్‌ ఈ విషయాన్ని నిర్ధారించింది. దీంతో వైరస్‌ నుంచి తెలంగాణ ప్రజలకు ఊరట లభించినట్లయింది.

Monkeypox: హమ్మయ్య.. కామారెడ్డి యువకుడికి మంకీపాక్స్ నెగెటివ్‌.. నిర్ధారించిన పుణె వైరాలజీ ల్యాబ్‌
Monkeypox In Telangana
Follow us

|

Updated on: Jul 26, 2022 | 6:28 PM

Telangana: తెలంగాణ ప్రజలు, వైద్యాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మంకీపాక్స్‌ లక్షణాలున్న కామారెడ్డి యువకుడికి నెగెటివ్‌ అని తేలింది. ఈ మేరకు పుణెలోని వైరాలజీ ల్యాబ్‌ ఈ విషయాన్ని నిర్ధారించింది. దీంతో వైరస్‌ నుంచి తెలంగాణ ప్రజలకు ఊరట లభించినట్లయింది. అయితే నెగెటివ్‌ వచ్చినా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది. కాగా కామారెడ్డి ఇందిరాకాలనీకి చెందిన ఓ వ్యక్తి కొన్ని రోజుల క్రితమే కువైట్‌ నుంచి వచ్చాడు. అతనిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతనిని వెంటనే హైదరాబాద్‌ ఫీవర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఆపై అతని నుంచి బ్లడ్‌ శాంపిల్స్‌ని సేకరించి టెస్ట్‌ కోసం పుణెలోని NIV వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ఈక్రమంలో అతనికి నెగెటివ్‌ అని తేలింది. కాగా రిజల్ట్‌ వచ్చేవరకు బాధితుడిని ఫీవర్‌ ఆస్పత్రిలోనే స్పెషల్‌ అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఇక బాధితుడితో కాంటాక్ట్‌ అయిన మరో ఆరుగురిని కూడా గుర్తించారు. అయితే వారిలో ఎలాంటి ఎలాంటి లక్షణాలు లేవు. అయినప్పటికీ వారిని కూడా ఐసోలేషన్‌లో ఉంచారు. కాగా మంకీపాక్స్‌ గురించి ఆందోళన చెందవద్దని, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యా ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles