Green Field Highway: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. గ్రీన్ ఫీల్డ్ హైవేపై బ్రిడ్జి నిర్మిస్తుండగా..

|

Jan 18, 2024 | 7:55 PM

Khammam-Devarapalli Expressway: తృటిలో పెను ప్రమాదం తప్పింది. గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. సిమెంటు కాంక్రీట్ స్లాబ్ పోస్తుండగా స్లాబ్ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం వద్ద చోటుచేసుకుంది. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా బ్రిడ్జిపై కాంక్రీట్‌ పోస్తుండగా ఒక్కసారిగా స్లాబ్‌ కూలింది. దీంతో అప్రమత్తమైన కార్మికులు బ్రిడ్జిపై నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. కాగా ఈ […]

Khammam-Devarapalli Expressway: తృటిలో పెను ప్రమాదం తప్పింది. గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. సిమెంటు కాంక్రీట్ స్లాబ్ పోస్తుండగా స్లాబ్ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం వద్ద చోటుచేసుకుంది. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా బ్రిడ్జిపై కాంక్రీట్‌ పోస్తుండగా ఒక్కసారిగా స్లాబ్‌ కూలింది. దీంతో అప్రమత్తమైన కార్మికులు బ్రిడ్జిపై నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. కాగా ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో అపశృతి చోటుచేసుకోవడంతో.. అధికారులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలను అడగి తెలుసుకున్నారు. కాగా.. గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పై ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..