పచ్చి మిర్చి చూశాం.. ఎర్ర మిర్చి చూశాం.. ఖమ్మంలో నల్ల మిర్చి హాట్ టాపిక్!

ఖమ్మంలో నల్ల మిరపకాయలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఖమ్మం–వరంగల్ బైపాస్ రోడ్డులోని ఎదులాపురంలో ఓ కిరాణా దుకాణంలో విక్రయానికి ఉంచిన ఈ నల్ల మిర్చి స్థానికులను ఆకర్షిస్తోంది. ఛత్తీస్‌గఢ్ నుంచి తీసుకొచ్చిన ఈ ప్రత్యేక మిరపకాయలు సాధారణ మిర్చి కంటే ఎక్కువ ఘాటుగా ఉంటాయని విక్రేతలు చెబుతున్నారు.

పచ్చి మిర్చి చూశాం.. ఎర్ర మిర్చి చూశాం.. ఖమ్మంలో నల్ల మిర్చి హాట్ టాపిక్!
Black Chillies

Edited By:

Updated on: Oct 12, 2026 | 12:08 PM

పచ్చి మిరపకాయలు చూశాం.. ఎర్ర మిరపకాయలు చూశాం.. మరి నల్ల మిరపకాయలను ఎప్పుడైనా చూశారా? చూడటమే కాదు.. వాటిని రుచి చూడాలన్న ఆసక్తి ఉందా? అయితే ఖమ్మంలోకి రావాల్సిందే! ఖమ్మంలో ప్రస్తుతం ఈ వింత రంగు మిరపకాయలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఖమ్మం–వరంగల్ బైపాస్ రోడ్డులోని ఎదులాపురంలో ఉన్న ఓ కిరాణా దుకాణంలో విక్రయానికి ఉంచిన నల్ల మిరపకాయలు ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా పచ్చగా కనిపించే మిరపకాయలు నల్లగా ఉండటంతో వాటిని చూసినవారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ మిరపకాయలు ఎక్కడివి? వీటి ప్రత్యేకత ఏమిటి? అంటూ ఆసక్తిగా ఆరా తీస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్ నుంచి ఖమ్మంకు..

ఎదులాపురంలోని కిరాణా దుకాణం యజమాని నాగవాణి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తండ్రి లక్ష్మణ్ కుమార్ శర్మ సుబ్రహ్మణ్య స్వామి అనుష్ఠానాలు నిర్వహిస్తుంటారు. పూజా కార్యక్రమాల నిమిత్తం ఆయన తరచూ కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లినప్పుడు అక్కడ లభించే ప్రత్యేకమైన నల్ల మిరపకాయలను కొనుగోలు చేసి ఖమ్మంకు తీసుకొచ్చారు. వివిధ రాష్ట్రాల్లో లభించే అరుదైన, ప్రత్యేకమైన వస్తువులను స్థానిక ప్రజలకు కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే వీటిని తీసుకొచ్చినట్లు లక్ష్మణ్ కుమార్ శర్మ చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో దొరికే వెరైటీ వస్తువులను తన దుకాణంలో తక్కువ ధరకు విక్రయిస్తూ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.

రంగు నలుపు.. ఘాటు మాత్రం ఎక్కువే!

చూడటానికి సాధారణ మిరపకాయల్లాగే కనిపించినా.. వీటి నలుపు రంగు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అంతేకాదు, సాధారణ మిరపకాయలతో పోలిస్తే వీటిలో ఘాటు ఎక్కువగా ఉంటుందని విక్రేతలు చెబుతున్నారు. దీంతో కారం ఇష్టపడేవారు ఈ నల్ల మిరపకాయలను ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారట. మొత్తానికి, సాధారణంగా కనిపించే మిరపకాయల మధ్య ఈ నల్ల మిర్చి తన ప్రత్యేక రంగుతో అందరి చూపును ఆకర్షిస్తోంది. ఖమ్మంలో ప్రస్తుతం ఈ వెరైటీ మిరపకాయల గురించి స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us