
ఈ మధ్య కాలంలో యువత చేస్తున్న పోకిరి చేష్టలు మరీ మితిమీరి పోతున్నాయి. మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం.. మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? అనేది ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలానే రోడ్‌లపై బైక్‌లతో స్టంట్స్ చేస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురిచేశారు కొందరు పోకిరీలు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కూసుమంచి వద్ద నేషనల్ హైవేపై కొందరు యువకులు బైక్ స్టంట్స్‌తో హల్ చల్ చేశారు. నలుగురు యువకులు పట్టపగలే రెండు బైక్ లపై విన్యాసాలు.. చేస్తూ, పెద్ద పెద్ద శబ్దాలు, కేకలతో న్యూసెన్స్ చేశారు.
హైవేపై వాహనదారులకు ఇబ్బంది కలిగేలా.. బైక్స్‌ను డ్రైవ్ చేస్తూ నానా రచ్చ చేశారు. అయితే రోడ్డుపై రెచ్చిపోయిన ఈ పోకిరీట బైక్ స్టంట్లకు కొందరు వాహనదారులు రికార్డ్ చేసి.. పోలీసులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతొ, వాళ్లు పంపిన వీడియోలోని బైక్స్ నెంబర్ల ఆధారంగా.. ఆ యువకును గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఈ వీడియోలో కనిపిస్తున్న యువకుల వివరాలు తెలిస్తే ఖమ్మం రూరల్ పోలీసులకు అందించాలని ప్రకటన విడుదల చేశారు. వీరి ఆచూకీ చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.