KCR With TV9: కేసీఆర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ.. ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

KCR With TV9: దేవుళ్ల మీద ఓట్లు.. కేసీఆర్‌ మీద తిట్లు.. తెలంగాణలో జరుగుతున్న రాజకీయం ఇదే.. కాంగ్రెస్, బీజేపీది రాజకీయ వికృత క్రీడ.. అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. దశాబ్దకాలం తర్వాత కేసీఆర్ టీవీ9 ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రజినీకాంత్ లైవ్‌ షో విత్ కేసీఆర్.. లైవ్ ప్రొగ్రాంలో పాల్గొన్న కేసీఆర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

KCR With TV9: కేసీఆర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ.. ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Kcr With Tv9

Updated on: Apr 23, 2024 | 7:32 PM

KCR With TV9: దేవుళ్ల మీద ఓట్లు.. కేసీఆర్‌ మీద తిట్లు.. తెలంగాణలో జరుగుతున్న రాజకీయం ఇదే.. కాంగ్రెస్, బీజేపీది రాజకీయ వికృత క్రీడ.. అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. దశాబ్దకాలం తర్వాత కేసీఆర్ టీవీ9 ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రజినీకాంత్ లైవ్‌ షో విత్ కేసీఆర్.. లైవ్ ప్రొగ్రాంలో పాల్గొన్న కేసీఆర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ.. అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ రాజకీయ వికృత క్రీడ చేస్తున్నాయంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చిందని.. ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాయన్నారు. కాంగ్రెస్ లో విలీనం అంశంగా గురించి రజినీకాంత్ ప్రశ్నించగా.. వాస్తవానికి కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న మాట వాస్తవమని.. అప్పట్లో వాళ్లు తన మాటను వినలేదంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు.

కేసీఆర్ ను తగ్గించాలని చాలామంది ప్రయత్నించారని.. కానీ.. ఆ ప్రయత్నం సాగదంటూ గులాబీ బాస్ కేసీఆర్ పేర్కొన్నారు. స్వేత పత్రాల పేరుతో.. కాంగ్రెస్ పాలకులు ఐదు నెలలు వృధా చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. తమకు వన్ థర్డ్ సీట్లు వచ్చాయని.. ఎన్నికల్లో పెద్ద వ్యత్యాసం ఏం లేదని కేసీఆర్ పేర్కొన్నారు. ఇతరులను తిడుతూ చేసేది పాలన కాదంటూ కేసీఆర్ పేర్కొన్నారు. బజారు భాష మాట్లాడటం వేరు.. ప్రభుత్వాన్ని నడపడటం వేరు.. అంటూ పేర్కొన్న కేసీఆర్.. అలాంటి ధోరణి తమ దగ్గర లేదన్నారు.

కాంగ్రెస్‌ సభలన్నీ అట్టర్‌ ఫ్లాప్‌ అవుతున్నాయని.. అప్పట్లో ఇందిరా అంటే ఇండియా అన్నట్టు ఉండేదంటూ కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పరిస్థితి ఏమైందంటూ వివరించారు.  కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు.. ప్రజలను కాంగ్రెస్‌ గాలికి వదిలేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించాం.. ఈ తెలంగాణ వేరు..నాటి హైదరాబాద్‌ వేరు అంటూ పేర్కొన్నారు.

లైవ్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..