హైదరాబాద్ చుట్టూ 2 వందల ఎకరాల్లో ఖబ్రస్థాన్‌లు

కొత్తగా నిర్మించే సెక్రటేరియట్‌లో మందిరం, మసీదులు, చర్చిని నిర్మిస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రభుత్వ ఖర్చుతో ఈ నిర్మాణాలు జరుపుతామన్నారు. ప్రగతి భవన్‌లో ముస్లిం మత పెద్దలతో సమావేశమైన కేసీఆర్..

హైదరాబాద్ చుట్టూ 2 వందల ఎకరాల్లో ఖబ్రస్థాన్‌లు

Updated on: Sep 05, 2020 | 6:05 PM

కొత్తగా నిర్మించే సెక్రటేరియట్‌లో మందిరం, మసీదులు, చర్చిని నిర్మిస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రభుత్వ ఖర్చుతో ఈ నిర్మాణాలు జరుపుతామన్నారు. ప్రగతి భవన్‌లో ముస్లిం మత పెద్దలతో సమావేశమైన కేసీఆర్.. ఈ సందర్భంగా వాళ్ల అభిప్రాయాలు, సూచనలను తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత గంగా జమునా తహజీబ్‌కు అద్దం పట్టేలా.. ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేస్తామని, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పారు. అంతేకాదు, అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఇస్లామిక్ సెంటర్ ఏర్పాటు చేస్తామని.. హైదరాబాద్ చుట్టూ ఖబ్రస్థాన్‌లు రావాల్సిన అవసరం ఉందన్నారు. స్థలాలు సేకరించాలని రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించామని.. హైదరాబాద్‌లో వివిధ చోట్ల 150 నుంచి 200 ఎకరాల్లో ఖబ్రస్థాన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముస్లిం అనాథ పిల్లలకు ఆశ్రయమిచ్చి విద్య నేర్పించే అనీస్- ఉల్-గుర్భా నిర్మాణాలు కూడా వేగవంతం చేస్తామని ముస్లిం పెద్దలకు కేసీఆర్ హామీ ఇచ్చారు.

Loading...
Unable to load recommendations.
Follow Us