Jubilee Hills bypoll: ఓటర్ ఐడీ లేకున్నా ఓటు వేయొచ్చు.. ఇవి ఉంటే చాలు..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ఈ సందర్భంగా ఓటర్ ఐడీ కార్డు లేకపోయినా ఓటు వేయొచ్చని మీకు తెలుసా..? ఓటరు జాబితాలో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరు ఐడీతో పాటు 12 రకాల ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డులలో దేనినైనా పోలింగ్ బూత్‌లో చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

Jubilee Hills bypoll: ఓటర్ ఐడీ లేకున్నా ఓటు వేయొచ్చు.. ఇవి ఉంటే చాలు..
12 Documents To Vote In Jubilee Hills Bypoll

Updated on: Oct 10, 2025 | 11:24 AM

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ నెల 13న నోటిఫికేషన్, నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనుంది. అటు పార్టీలు సైతం అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఓటరు లిస్టులో పేరు ఉంది.. కానీ మీకు ఓటరు ఐడీ లేదా.. అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓటరు గుర్తింపు కార్డు లేనివారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. 12 రకాల ఫోటో ఐడీలలో ఏ ఒక్కటి చూపించినా ఓటు వేసే ఛాన్స్ ఉంటుందని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు.

ఓటర్ ఐడీతో పాటు పోలింగ్ బూత్‌లో ఈ 12 ఐడీలలో దేనినైనా చూపించవచ్చు:

  • ఆధార్ కార్డు
  • ఉపాధిహామీ జాబ్ కార్డు
  • బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ ఫోటో పాస్‌బుక్
  • ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు / కేంద్ర కార్మికశాఖ స్మార్ట్ కార్డు
  • డ్రైవింగ్ లైసెన్స్
  • పాన్ కార్డు
  • NPR కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డు
  • భారతీయ పాస్‌పోర్ట్
  • ఫోటో ఉన్న పెన్షన్ పత్రాలు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆఫీషియల్ ఐడీ కార్డులు
  • ఎంపీ/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ అధికారిక గుర్తింపు కార్డులు
  • UDID (దివ్యాంగుల ప్రత్యేక గుర్తింపు కార్డు)

ఓటర్ జాబితాలో పేరు ఉండి.. ఈ 12 ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులలో ఏ ఒక్కటి ఉన్నా ఓటు వేయొచ్చని కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజలంతా తప్పకుండా తమ ఓటు హగ్గు విని ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..