Jammu & Kashmir: సొంతగడ్డపై పరాయిలా.. పర్యాటక స్వర్గధామం –పాత్రికేయులకు నిత్యనరకం

కశ్మీర్.. పరిచయం అవసరం లేని పర్యాటక ప్రాంతం… భూమ్మీద వెలసిన స్వర్గం… వేర్పాటువాద విషవృక్షం విస్తరించిన నేలపై భద్రతా బలగాలకు దినదినం క్షణక్షణం ఓ గండం. అక్కడి పరిస్థితుల గురించి బయటి ప్రపంచం టీవీ ఛానెళ్లు, పత్రికా కథనాల ద్వారా తెలుసుకుంటుంది. కానీ వాటిని అందించే క్రమంలో పాత్రికేయులకు ఎదురయ్యే సవాళ్లు, ప్రమాదాల గురించి చాలా మందికి తెలియదు. అవి తెలియాలంటే.. బిహైండ్ ది స్క్రీన్ – బిహైండ్ ది కెమేరా ఏం జరుగుతుందో తెలియాలి. ఆ […]

Jammu & Kashmir: సొంతగడ్డపై పరాయిలా.. పర్యాటక స్వర్గధామం –పాత్రికేయులకు నిత్యనరకం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 20, 2020 | 1:10 PM

కశ్మీర్.. పరిచయం అవసరం లేని పర్యాటక ప్రాంతం… భూమ్మీద వెలసిన స్వర్గం… వేర్పాటువాద విషవృక్షం విస్తరించిన నేలపై భద్రతా బలగాలకు దినదినం క్షణక్షణం ఓ గండం. అక్కడి పరిస్థితుల గురించి బయటి ప్రపంచం టీవీ ఛానెళ్లు, పత్రికా కథనాల ద్వారా తెలుసుకుంటుంది. కానీ వాటిని అందించే క్రమంలో పాత్రికేయులకు ఎదురయ్యే సవాళ్లు, ప్రమాదాల గురించి చాలా మందికి తెలియదు. అవి తెలియాలంటే.. బిహైండ్ ది స్క్రీన్ – బిహైండ్ ది కెమేరా ఏం జరుగుతుందో తెలియాలి. ఆ ప్రయత్నమే ఇది.
యావత్ ప్రపంచం వాలెంటైన్స్ డే (ప్రేమికుల దినోత్సవం) సంబరాల్లో మునిగితేలుతున్న వేళ కశ్మీర్ లోయలో జరిగిన ఉగ్రవాద ఘాతుకం మాటల్లో చెప్పలేనిది. అక్షరాల్లో రాయలేనిది. ఆ వార్త తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లి గ్రౌండ్ జీరో నుంచి వాస్తవమేంటో ప్రపంచానికి తెలియజేయాలన్న బలమైన కోరిక నాలో మొదలైంది. అందుకు తగ్గట్టుగానే మా బాస్ రజనీకాంత్ గారి ఆదేశాలు, మురళీకృష్ణ గారి నుంచి సూచనలు వచ్చాయి. బ్యాక్ ఆఫీస్ వెంటనే టికెట్ల కోసం ప్రయత్నించింది. ఉగ్రదాడి ఉద్రిక్తతల కారణంగానో, ప్రతికూల వాతావరణం వల్లనో.. ఢిల్లీ నుంచి నేరుగా శ్రీనగర్‌కు టికెట్ దొరకలేదు. దాంతో ఢిల్లీ నుంచి జమ్ముకు టికెట్ బుక్ చేశారు. నేను,  కెమెరామన్ రమేశ్, మా టీవీ9 కన్నడ రిపోర్టర్ హరీశ్ మర్నాడు ఉదయాన్నే బయల్దేరి జమ్ము చేరుకున్నాం. జమ్ము ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికొచ్చేసరికి ఉగ్రదాడి నిరసన సెగలు కంటికి కనిపించాయి. శ్రీనగర్ రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలపై జమ్ము స్థానికులు దాడికి పాల్పడి వాటిని తగులబెట్టారు. నిజానికి శ్రీనగర్ రిజిస్ట్రేషన్ కలిగిన వాహనదారులకు, ఉగ్రదాడికి ఏమాత్రం సంబంధం లేకపోయినా, జమ్ము స్థానికుల్లో ఆగ్రహావేశాలు వారిని హింసకు ప్రేరేపించాయి. ఎందుకంటే, శ్రీనగర్ లోయ నుంచి కశ్మీరీ పండిట్ల తరిమివేత తర్వాత అక్కడ అత్యధికశాతం ముస్లింలే ఉన్నారు. జమ్ము లోయలో హిందువులు, సిక్కుల సంఖ్య ఎక్కువగా, ముస్లింల సంఖ్య తక్కువగా ఉంటుంది. శ్రీనగర్ నుంచి వచ్చినవారంతా ఉగ్రవాదులేనన్న ఒక ఆవేశపూరిత ఆలోచన ఫలితంగా అక్కడి వాహనాలను టార్గెట్ చేసి మరీ తగులబెట్టారు.
జమ్ములో పరిస్థితి ఇలా ఉంటే ఉగ్రదాడికి కేంద్రబిందువైన కశ్మీర్ లోయలో, పుల్వామాలో పరిస్థితి ఎలా ఉందో అందరికీ చూపించాలనే  ఉద్దేశంతో అక్కడ్నుంచి  శ్రీనగర్‌కు  రోడ్డు మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాం. జమ్ము నుంచి కూడా శ్రీనగర్‌కు టికెట్లు దొరకలేదు. కానీ ఢిల్లీ నుంచి నేరుగా శ్రీనగర్‌కు టికెట్లు కనిపించేసరికి, వెంటనే ఢిల్లీలో ఉన్న మా బ్యాకప్ టీమ్ సురేశ్, బక్కప్ప (ప్రభు)లకు టికెట్లు బుక్ చేయించి వారిని హుటాహుటిన శ్రీనగర్‌కు పంపించాం. మేము జమ్ములో ఆ రాత్రి అంటే ఫిబ్రవరి 15న బస చేసి, మర్నాడు ఉదయాన్నే ఒక కార్ మాట్లాడుకుని బయలుదేరాం. నిజానికి ఆ పరిస్థితుల్లో శ్రీనగర్‌కు రోడ్డు మార్గంలో వచ్చేందుకు ట్రావెల్స్ – ట్యాక్సీలు ఎవరూ ముందుకు రాలేదు. స్థానికంగా ఉన్న పాత్రికేయుల రిఫరెన్స్‌ తో అతి కష్టం మీద ఓ సర్దార్జీ కారు ఏర్పాటైంది. ఒప్పందం ప్రకారం మమ్మల్ని సాయంత్రం  నాలుగు గంటలలోగా బనిహాల్ రైల్వే స్టేషన్ దగ్గర దింపాలి. అక్కడ్నుంచి  మేం రైలు మార్గంలో శ్రీనగర్ చేరుకోవాలన్నది మా ఆలోచన.
(జమ్ము నుంచి నేరుగా శ్రీనగర్‌కు రైలు మార్గం నిర్మాణం పూర్తి కాలేదు. మధ్యలో ఓ టన్నెల్ నిర్మాణం పూర్తయితే నేరుగా కనెక్టివిటీ ఏర్పడుతుంది. అంతవరకు టన్నెల్ అవతల ఉన్న బనిహాల్ నుంచి శ్రీనగర్ వరకు రైలు మార్గం పూర్తవడంతో ఆ మార్గంలో రైళ్లను నడుపుతున్నారు.)
 మా సర్జార్జీ డ్రైవర్ హిమాలయాల మీద మెలికలు తిరుగుతూ ఆకాశాన్ని తాకుతున్న ఘాట్ రోడ్డుపై వీలైనంత వేగంగానే కారును నడుపుతున్నాడు. అయితే మధ్యలో నిరసన సెగలు, కొండచరియలు విరిగిపడడం కారణంగా అడుగడుగునా అవాంతరాలతో ప్రయాణం ఆలస్యమవుతూ వచ్చింది. అప్పటికీ పట్ని టాప్ మీదుగా పర్వతాల శ్రేణి ఎక్కి దిగాల్సిన అవసరం లేకుండా కొత్తగా రోడ్డు మార్గం కోసం నిర్మించిన 10 కిలోమీటర్ల పొడవైన ‘చెనాని –నష్రి’ టన్నెల్ ద్వారానే ప్రయాణం చేశాం. అలా మూడు నాలుగు  గంటల సమయం ఆదా చేశాం.  అనుకున్న సమయానికి కాస్త అటూ ఇటుగా బనిహాల్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత చూస్తే రైల్వే ట్రాక్ మీద దాదాపు రెండు  అడుగల మందం మంచు పేరుకుపోయి ఉంది. ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే.. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో బనిహాల్ నుంచి రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని. కానీ మేం ఎలాగైనా శ్రీనగర్ చేరుకోవాలి. ఎందుకంటే మా బ్యాకప్ టీమ్ సురేశ్-ప్రభు ఇద్దరూ నేరుగా ఢిల్లీ నుంచి శ్రీనగర్ చేరుకున్నారు. ఘటనాస్థలం నుంచి చేసిన కవరేజి పంపే ఏర్పాటు వాళ్ల దగ్గర లేదు. 4జీ లైవ్ కిట్ మా దగ్గరే ఉంది. మేం వెళ్తేనే వాళ్లు ఆ ఫుటేజి పంపించగలరు. తద్వారా అది టెలీకాస్ట్ చేయగలం.
అందుకే అటూ ఇటూ కాకుండా మధ్యలో ఇరుక్కుపోతే ఎలా.. అని ఒప్పుకున్నదాని కంటే ఎక్కువే ఎమౌంట్ ఇస్తామని చెప్పి మొత్తానికి ఎలాగోలా డ్రైవర్‌ని శ్రీనగర్‌లో దింపాల్సిందిగా ఒప్పించాం. కారుకు రెండింతల ఎత్తుతో పేరుకుపోయిన మంచు మధ్య ప్రమాదభరితంగా మా ప్రయాణం సాగించి అర్థరాత్రికి శ్రీనగర్ చేరుకున్నాం. అసలే జమ్ము రిజిస్ట్రేషన్ కార్, జమ్ములో జరిగిన ఉదంతాలతో కశ్మీర్ లోయలో స్థానికులు కూడా అదే తరహా ఆగ్రహావేశాలతో ఉంటారన్న భయం మధ్య బిక్కుబిక్కు మంటూ గడిపాం. ఈ లోపు ట్రావెల్స్ యజమాని కార్ డ్రైవర్‌కు ఫోన్ల మీద ఫోన్లు చేసి జమ్ము రిజిస్ట్రేషన్ కారును శ్రీనగర్‌కు ఎందుకు తీసుకెళ్లావు? అది సేఫ్ గా తిరిగిరాకపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు? అంటూ సీరియస్ అయ్యాడు. అడుగడుగునా తనిఖీలు చేస్తున్న భద్రతా సిబ్బందికి మా ఐడీ కార్డులు చూపిస్తూ, బయటి నుంచి వచ్చినందున వారు మాకు జాగ్రత్తలు చెబుతూ.. ఎలాగైతేనేం.. సుమారు 16 గంటల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసి అర్థరాత్రికి శ్రీనగర్ చేరుకున్నాం. అప్పటికే శ్రీనగర్ చేరుకున్న మా బ్యాకప్ టీమ్ సురేశ్-ప్రభులకు సిటీలో ఎక్కడైతే సేఫ్‌గా ఉండగలమో సూచించి, పాత మిత్రుడు మెహరాజ్ అహ్మద్  సహకారంతో లాల్‌చౌక్ ప్రెస్ కాలనీలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌజ్‌లో మకాం ఏర్పాటు చేయించాను. మేం కూడా నేరుగా అక్కడికే చేరుకుని మా బ్యాకప్ టీమ్‌తో పాటుగా బస చేశాం.
బనిహాల్ నుంచి మలి దశ ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఫోన్ ద్వారా మా బ్యాకప్ టీమ్‌తో మాట్లాడుతూ ఫుటేజి పంపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాం. ఉగ్రదాడి కారణంగా శ్రీనగర్ సిటీ మొత్తం దాదాపు లాక్‌డౌన్ చేసిన పరిస్థితి. ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా పంపాలన్నా, మా కెమెరాలో రికార్డయిన ఫుటేజిని ల్యాప్‌టాప్‌లోకి తీసుకుని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఏర్పాటు కూడా మా బ్యాకప్ టీమ్ దగ్గర లేదు.  అదే రోజు మరో తెలుగు ఛానెల్‌ టీమ్‌ శ్రీనగర్ చేరుకుంది.. వారు కశ్మీర్‌కు రావడం అదే మొదటిసారి..  వారికి శ్రీనగర్‌ కొత్త…  పరిచయస్తులెవరూ లేరు.. ఏం చేయాలో తెలియదు. వాళ్లు సహాయం కోరుతూ నాకే ఫోన్ చేశారు.  మా వాళ్లకు సూచించినట్టే వారికి  కూడా అదే గెస్ట్ హౌజ్ సూచించాను. వాళ్ల దగ్గరున్న 4జీ కిట్ ద్వారా హైదరాబాద్ హెడాఫీస్‌కు మా ఫుటేజి పంపించే ఏర్పాటు చేశాం. అలా మేం చేరుకునేలోపే మా బ్యాకప్ టీమ్ చేసిన కవరేజి మొత్తం ఆఫీసుకు చేరుకుంది. ప్రైమ్ టైమ్‌లో టెలికాస్ట్ అయింది.
CONTD… తదుపరి భాగం.. యుద్ధభూమిలో ఆతిథ్యం..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో