Telangana: నిర్మల్ జిల్లాలో వీడీసీల అరాచకం.. వ్యక్తిగత కక్షతో 300 కుటుంబాల బహిష్కరణ..!

Telangana: నిర్మల్ జిల్లాలో వీడీసీల అరాచకం నానాటికీ పెరిగిపోతుంది. అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్న వీడీసీలు.. అభివృద్ధికి విఘాతాలుగా మారుతున్నారు.

Telangana: నిర్మల్ జిల్లాలో వీడీసీల అరాచకం.. వ్యక్తిగత కక్షతో 300 కుటుంబాల బహిష్కరణ..!
Nirmal
Follow us

|

Updated on: Apr 12, 2022 | 5:57 AM

Telangana: నిర్మల్ జిల్లాలో వీడీసీల అరాచకం నానాటికీ పెరిగిపోతుంది. అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్న వీడీసీలు.. అభివృద్ధికి విఘాతాలుగా మారుతున్నారు. వ్యక్తిగత కక్షతో 300 కుటుంబాల బహిష్కరించారు. వారికి సహకరించిన వారికి భారీ జరిమానా వేస్తామంటూ హుకూం జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో వీడీసీల ఆగడాలు హద్దు మీరి పోతున్నాయి. గతంలో కూడా వీడీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా నిర్మల్‌ జిల్లా మామడ మండలం న్యూ సాంఘ్వీ గ్రామంలో ఏకంగా 300 కుటుంబాలకు బహిష్కరించారు వీడీసీ సభ్యులు. ఇక్కడ ఉన్న వడ్డెర కులస్తులను వీడీసీ లు, గ్రామస్తులు బహిష్కరించారు. ఇదే గ్రామంలో 300 కుటుంబాలకు చెందిన వడ్డెర కులస్తులు గత 80 ఏళ్లుగా నివసిస్తున్నారు. అయితే ఉన్నపళంగా వీరిని గ్రామ బహిష్కరణ చేశారు. కేవలం వీడీసీ అధ్యక్షుడు, మండల ఉపాధ్యక్షుడు వ్యక్తిగత కక్షతోనే వీరిని బహిష్కరించినట్టు తెలుస్తోంది. వీరితో ఎవరైనా మాట్లాడినా, వారికి ఎవరైనా సహకరించినా రూ.5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కిరాణా సరుకులు, రేషన్ సరుకులు కూడా ఇవ్వకూడదని తీర్మానించారు. అంతేకాదు వీరికి చెందిన పశువులను గ్రామంలోకి రానివ్వద్దని ఆంక్షలు విధించారు.

ఇటీవల గ్రామంలో నిర్వహించిన ఓ పండగ తర్వాత అటు గ్రామస్తులు, ఇటు ఒడ్డెర కులస్తుల మధ్య విభేదాలు మొదలైనట్టు తెలుస్తోంది. ఆ పండగ కూడా తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామస్తులు నిర్వహించారని ఒడ్డెర కులస్తులు చెబుతున్నారు. ఈ వివాదం నేపథ్యంలోనే వీడీసీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుసుకుంది.

Also read:

IPL 2022: వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. కెప్టెన్‌ ఇన్సింగ్స్‌ ఆడిన విలియమ్సన్..

Investment: ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో మహిళలు ఎందుకు వెనకబడుతున్నారు.. కారణమేంటంటే..

విద్యార్ధులకు అలర్ట్! TSRJC CET 2022 దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే..