Weather: తెలంగాణలో విచిత్ర వాతావరణం.. నేటి వెదర్ రిపోర్ట్ ఇదే..

రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలు ఎక్కువగా ఉంటే కొన్ని గంటల పాటు విద్యుత్​ ఆగిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్​ లేని ప్రాంతాల వైపు వెళ్లాలని సూచించింది.

Weather: తెలంగాణలో విచిత్ర వాతావరణం.. నేటి వెదర్ రిపోర్ట్ ఇదే..
Weather

Updated on: Apr 23, 2024 | 2:08 PM

తెలంగాణలో గతకొన్ని రోజులుగా విచిత్ర వాతావరణం నడుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఎండ కాస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది.  వారం క్రితం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. దీంతో రైతులు నష్టపోయారు. రాజధాని హైదరాబాద్‌లోనూ వర్షం దంచికొట్టింది. భారత వాతావరణ శాఖ తాజా అప్‌డేట్ ప్రకారం తెలంగాణలో మంగళవారం పలు ప్రాంతాల్లో చెదురుమదుదరు వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని.. అలాగే గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు అధికారులు.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌, నిజామాబాద్, రామగుండం పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్స్ కూడా పెరుగుతాయన్నారు. తెలంగాణలో పగటివేళ 36 నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ వేడి ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణలో ఎండలు అదరగొడతాయని అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఇక హైదరాబాద్‌లో పగటి ఉష్టోగ్రతలు విపరీతంగా పెరిగే చాన్స్ ఉంది సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Loading...
Unable to load recommendations.
Follow Us