Telangana Rains: హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం.. తెలంగాణలోని ఆ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు..

Telangana Rains: హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం.. తెలంగాణలోని ఆ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు..
Rains

రాత్రి నుంచి తెలంగాణలోని చాలా జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంది. అయితే తాజా వివరాలను వాతావరణశాఖ రాష్ట్ర అధికారులు వెల్లడించారు.

Sanjay Kasula

|

May 11, 2022 | 9:53 AM

అసని తుఫాన్ ఎఫెక్ట్ ఇప్పుడు తెలంగాణపై(Telangana) కనిపిస్తోంది. రాత్రి నుంచి తెలంగాణలోని చాలా జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంది. అయితే తాజా వివరాలను వాతావరణశాఖ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. వర్షాలు పడే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరించారు. ఈదురు గాలులతోపాటు జోరు వర్షం పడుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం కూడా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్నారు.

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం నుంచి కర్ణాటక వరకు గాలుల్లో అస్థిరత కారణంగా ఉపరితలద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇక జెట్‌స్పీడ్‌గా కోస్తాంద్ర తీరంవైపు దూసుకొచ్చిన.. అసని తుపాను బలహీనపడింది. తీరాన్ని తాకకుండానే దిశ మార్చుకుంది. ప్రస్తుతం మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. గంటకు 12కిలోమీటర్ల వేగంతో.. ఈశాన్యం వైపు కదులుతోంది. నర్సాపురం సమీపంలో పూర్తిగా భూభాగంపైకి వచ్చే ఛాన్సెస్‌ ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu