CBN Arrest: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలంగాణ, బెంగళూరుల్లో నిరసనలు

Updated on: Sep 16, 2023 | 6:37 PM

స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు జైలుకు వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉప్పల్‌ రింగ్‌రోడ్‌లో టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రగతినగర్‌లో కూడా టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిజామాబాద్‌లో టీడీపీ శ్రేణులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించాయి. వందలాదిమంది కార్యకర్తలు ఈ ర్యాలీలోపాల్గొన్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కోదాడలో టీడీపీ-జనసేన నిరసర ప్రదర్శన నిర్వహించాయి. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా బెంగళూరులో ఐటీ ఉద్యోగులు, టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. బెంగళూరు విధాన సౌధ సమీపంలోని ఫ్రీడమ్‌ పార్కు దగ్గర నిరసన తెలిపారు.

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఏపీలో గుంటూరు లాంటి ఒకటి రెండు చోట్ల మినహా మిగిలిన చోట్ల పెద్దగా ఆందోళన కార్యక్రమాలు జరగడం లేదు. అయితే ఏపీయేతర ప్రాంతాల్లో నిరసనల జోరు కొనసాగుతోంది. తెలంగాణలోనే కాదు..ఐటీ హబ్‌ బెంగళూరులో కూడా బాబుకు సంఘీభావంగా ర్యాలీలు చేస్తున్నారు. ఏపీలో తక్కువ…మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కువగా నిరసన కార్యక్రమాలు జరగడం విశేషం. చంద్రబాబు అరెస్టుపై నిరసనల పర్వం కొనసాగుతోంది. అయితే ఏపీలో నిరసలు నీరసిస్తుంటే…తెలంగాణలో మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఔటర్‌ రింగ్‌రోడ్‌పై టీడీపీ మద్దతుదారులు కార్ల ర్యాలీ నిర్వహించారు. దీంతో పాటు హైదరాబాద్‌లో పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక బాబు అరెస్టుపై బెంగళూరులో కూడా నిరసన తెలిపారు టీడీపీ అభిమానులు. చంద్రబాబుకు సంఘీభావంగా హైదరాబాద్‌ ORRపై టీడీపీ శ్రేణులు కార్ల ర్యాలీ నిర్వహించాయి. కార్ల ర్యాలీకి పోలీసులు నో చెప్పడంతో, వాళ్లతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. కోకాపేట నియో పోలీస్‌ గేట్ దగ్గర మాజీ ఎంపీ మాగంటి బాబు బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీస్‌ అధికారిని మాగంటి బాబు తోసేశారు. వాహనాలను సీజ్‌ చేసిన పోలీసులు, టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తార్నాకలో ఆయన అభిమానులు మౌనదీక్ష చేపట్టారు. బాబు అభిమానులు, టీడీపీ మద్దతుదారులు ఈ కార్యక్రమనికి హాజరయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Sep 16, 2023 06:37 PM