Tv9 Cross Fire: ‘నాకు పబ్లిసిటీ అవసరం లేదు.. రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదు’: ఏవీ రంగనాథ్

చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా కోరల్లో చిక్కుకుని భాగ్యనగరం విపత్తులో మునిగిపోయింది. ఇలాంటి వారి చెర నుంచి రక్షించాలనన్న లక్ష్యంతో దూకుడు ప్రదర్శిస్తోంది హైడ్రా. అయితే కొందరు అనుకూలంగా మరికొందరికి వ్యతిరేకంగా సాగుతున్న కూల్చివేతలపై ప్రజల నుంచి వ్యతిరేకతలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌ క్రాస్‌ఫైర్‌లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ సమాధానాలు ఇచ్చారు.

Tv9 Cross Fire: ‘నాకు పబ్లిసిటీ అవసరం లేదు.. రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదు’: ఏవీ రంగనాథ్
Av Ranganath Clarity On His Political Entry

Updated on: Mar 21, 2026 | 9:22 PM

చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా కోరల్లో చిక్కుకుని భాగ్యనగరం విపత్తులో మునిగిపోయింది. ఇలాంటి వారి చెర నుంచి రక్షించాలనన్న లక్ష్యంతో దూకుడు ప్రదర్శిస్తోంది హైడ్రా. అయితే కొందరు అనుకూలంగా మరికొందరికి వ్యతిరేకంగా సాగుతున్న కూల్చివేతలపై ప్రజల నుంచి వ్యతిరేకతలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌ క్రాస్‌ఫైర్‌లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ సమాధానాలు ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ స్థలాలను రక్షించడమే ముఖ్య ఉద్దేశ్యమని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తనకు పబ్లిసిటీ పిచ్చి లేదని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎలాంటి కూల్చివేతలు జరిగినా హైడ్రాకు ఆపాదిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, రోడ్ల ఆక్రమణలను తొలగించేందుకు.. ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు.. నా ఉద్యోగాన్ని నేను సక్రమంగా చేసుకుంటున్నానన్నారు.

అంతేకాదు భారతదేశంలో కులాన్ని వేరుచేయలేమన్న రంగనాథ్‌, కాపు కుల మీటింగ్స్‌లో పాల్గొంటే తప్పేముందన్నారు. కుల మీటింగ్స్‌లో మంచి మాటలే చెప్తున్నానని అన్నారు. ప్రజల్లో అవగాహన కోసమే మీడియా ఇంటర్వ్యూలు ఇస్తున్నాని రంగనాథ్‌ క్లారిటీ ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవాలని బాధ్యతగా వ్యవహరిస్తున్నాని రంగనాథ్‌ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us