
ఎండలు దంచికొడుతున్నాయి.. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో.. ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వేసవి తాపం నుంచి బయటపడేందుకు మందుబాబులు.. బీర్లు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిల్ బీర్లు తాగుతూ.. ఎండలో కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఈ తరుణంలోనే.. మందుబాబులకు దిమ్మతిరిగే సీన్ కనిపించింది.. అలా మీరు కొని తాగాలనుకున్న మందుబాబుకు.. బీర్ లో చేప పిల్ల దర్శనమిచ్చింది.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో బీర్ బాటిల్‌లో చేప పిల్ల ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. మల్లాపూర్ సమీపంలోని ఓ వైన్ షాపులో ఓ వ్యక్తి.. ఓ బ్రాండెడ్ బీర్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. బాటిల్ సీల్ తీయబోయే ముందు.. బీర్ లోపల చూడగా అందులో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. తీరా నిశితంగా పరిశీలించగా.. , అందులో ఒక చిన్న చేప పిల్ల కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాకైన మందుబాబు.. ఆ బీరు బాటిల్‌ను షాపు నిర్వాహకులకు చూపించాడు.. దీంతో వారు కూడా అవాక్కయ్యారు. అంతేకాకుండా అక్కడున్న మందుబాబులు సైతం దీనిని ఆసక్తిగా తిలకించారు.
బాటిల్ సీల్ చేసి ఉన్నప్పటికీ లోపలికి చిన్న చేప పిల్ల ఎలా వచ్చింది.. అంటూ అక్కడ ఉన్న వారంతా చర్చించుకున్నారు.. ఇది మిస్టరీగా ఉందంటూ పేర్కొంటున్నారు. అయితే.. బీర్ల తయారీ కేంద్రం వద్ద బాటిళ్లను శుభ్రం చేసే ప్రక్రియలో కానీ, బీర్ నింపే సమయంలో కానీ తప్పిదం జరిగినట్లుగా పేర్కొంటున్నారు..
కాగా.. బీరు బాటిల్‌లో చేప ఉన్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు.. బీర్ తాగే ముందు ఒకసారి చూసుకోండి.. మావ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..