గవర్నర్‌తో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ

|

Jun 01, 2019 | 6:16 PM

హైదరాబాద్ రాజ్‌భవన్ లో గవర్నర్‌తో తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం గన్నవరం  నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. నేరుగా రాజ్ భవన్ వెళ్లారు. అక్కడే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై చర్చించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని కొన్ని అంశాలపై వివాదాలు ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. విభజన అంశాలపై ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు, […]

గవర్నర్‌తో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ
Follow us on

హైదరాబాద్ రాజ్‌భవన్ లో గవర్నర్‌తో తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం గన్నవరం  నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. నేరుగా రాజ్ భవన్ వెళ్లారు. అక్కడే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై చర్చించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని కొన్ని అంశాలపై వివాదాలు ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. విభజన అంశాలపై ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు, తదుపరి వ్యవహరించాల్సిన తీరు, నీటి వినియోగంపై బడంబడికల, తాజా రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. అనంతరం రంజాన్‌ సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఇచ్చే ఇఫ్తార్‌ విందుకు ఇద్దరు సీఎంలూ హజరుకానున్నారు.